సైబర్ నేరాల పట్ల యువత అప్రమత్తంగా ఉండాలి _ఇల్లంతకుంట ఎస్సై దాస.సుధాకర్

రాజన్న సిరిసిల్ల జిల్లా( Rajanna Sirisilla ) ఇల్లంతకుంట మండలంలోని యువత సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఇల్లంతకుంట ఎస్సై దాస సుధాకర్ తెలిపారు.సైబర్ జాగృక్త దినోత్సవాన్ని పురస్కరించుకుని ఇల్లంతకుంట మండల కేంద్రంలో గల జూనియర్ కళాశాలలో( junior college ) ఏర్పాటు చేసిన సైబర్ నేరాల అవగాహన సదస్సు కు ఎస్ఐ సుధాకర్ హాజరై మాట్లాడుతూ ప్రస్తుత సమాజంలో బందిపోటు నేరాలు గాని, దొంగతనాలు గాని, దారిదోపిడిలు గాని తగ్గిపోయాయని, సీసీ కెమెరాల వల్ల, సెల్ఫోన్ డాటా రికవరీ వల్ల, సెల్ ఫోన్ టవర్ లొకేషన్ ల వల్ల ముఖ్యమైన నేరాలన్నీ తగ్గుముకం పట్టాయని కానీ సైబర్ నేరగాళ్లు ప్రజల యొక్క అమాయకత్వాన్ని ఆసరా చేసుకుని రెచ్చిపోతున్నారని అన్నారు.

 Youth Should Be Vigilant About Cyber Crimes _illanthakunta Essay Dasa. Sudhakar-TeluguStop.com

ప్రస్తుత సమాజంలో సైబర్ నేరాల పట్ల విద్యార్థి నుంచి వృద్ధుని వరకు అవగాహన లేకపోవడం వల్ల సైబర్ నేరాల బారిన పడుతున్నారని, సైబర్ నేరాల బారిన పడకుండా ఉండాలంటే అవగాహన,అప్రమత్తత చాలా ముఖ్యమైనదని ఆయన అన్నారు.

ముఖ్యంగా యువత మొబైల్ ఫోన్,ఇంటర్నెట్ వాడకం చేసేటప్పుడు జాగ్రత్త వహించాలని, అనవసరమైన అప్లికేషన్లని డౌన్లోడ్ చేయకూడదని, అపరిచిత ఫోన్ కాల్స్ కి సమాధానం ఇవ్వకూడదని, ఆన్లైన్ లోన్ యాప్స్( Online Loan Apps ) ని వాడకూడదని, అసభ్యంగా ఉన్న అప్లికేషన్స్ ని డిలీట్ చేయాలని ఆయన కోరారు.

సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండడమే కాకుండా, తెలియకుండా సైబర్ నేరాల బారిన పడినవారు దరఖాస్తు ఇవ్వడానికి వెనకాడకూడదని పోలీస్ స్టేషన్ కి రావడం ఇబ్బందిగా ఉంటే ఆన్లైన్లో తమ యొక్క దరఖాస్తుని ఇవ్వాలని లేదా టోల్ ఫ్రీ నెంబర్ అయినా 1930 గాని ఎన్ సి ఆర్ పి పోర్టల్ లో గాని తమ యొక్క దరఖాస్తు ని నమోదు చేయాలని తెలిపారు.సైబర్ నేరం ద్వారా ఎవరైనా డబ్బు పోగొట్టుకున్నట్లయితే 24 గంటల లోపల ఎన్ సి ఆర్ పి లేదా 1930 నెంబర్ కి కాల్ చేసి దరఖాస్తుని నమోదు చేసినట్లయితే పోగొట్టుకున్న డబ్బులు తిరిగి పొందే అవకాశం ఎక్కువగా ఉంటుందని ఆయన అన్నారు.

సైబర్ క్రైమ్( cyber crimes ) అవగాహన కార్యక్రమంలో ఇల్లంతకుంట ఎస్సై దాస.సుధాకర్ తో పాటు కళాశాల ప్రిన్సిపాల్ , లెక్చరర్లు, కానిస్టేబుళ్లు తిరుపతి, మధు, లక్ష్మినారాయణ, జీవన్, కళాశాల విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube