రాచకొండను ఫిలిం సిటీ ప్రక్రియపై హర్షం

యాదాద్రి భువనగిరి జిల్లా: సంస్థాన్ నారాయణపురం( Narayanapoor ) మండల పరిధిలో నల్లగొండ,రంగారెడ్డి జిల్లాల సరిహద్దు ప్రాంతంలో వేలాది ఎకరాలలో విస్తరించి ఉన్న రాచకొండను ఫిలిం సిటీ( Film City ) చేయడం గొప్ప శుభపరిణామమని కాంగ్రెస్ పార్టీ నాయకులు హర్షం వ్యక్తం చేశారు.మండల కేంద్రంలో వారు మాట్లాడుతూ ఒకప్పుడు రాచరిక పాలనకు కేంద్ర బిందువైన రాచకొండను రాజధానిగా చేసుకొని రేచర్ల పద్మ నాయకులు 1961లో పరిపాలన చేశారని గుర్తు చేశారు.

 Congress Party Leaders Is Happy With The Process Of Film City In Rachakonda , N-TeluguStop.com

రాచకొండ పచ్చగా కనిపించే గుట్టలతో అరకులోయలను మించిన అందాలు కలిగి ఉన్నాయని,కనుల విందుగా కనిపించే అందాలను తెలంగాణ సమాజానికి అందించుటకు కృషి చేసిన మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి,ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి( Chief Minister Revanth Reddy )కి కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో మందుగుల బాలకృష్ణ,ఏపూరి సతీష్, కరంటోత్ శ్రీనివాస్ నాయక్,ఎండి నయిమ్ షరీఫ్,కోన్ రెడ్డి నరసింహ, జక్కిడి బాల్ రెడ్డి, రాచకొండ రమేష్ బాబు, ఉప్పల కృష్ణ,ఉప్పల నాగరాజు,జక్కల యాదయ్య,గోపాల్, లచ్చిరాం,నాను,మోహన్,శంకర్,రవీందర్,అంజయ్య తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube