పారేసే ఉల్లి, వెల్లుల్లి తొక్కలతో తెల్ల జుట్టుకు చెక్ పెట్టవచ్చు.. తెలుసా?

ఉల్లిపాయలు, వెల్లుల్లి.నిత్యం ఈ రెండిటిని వంటల్లో వాడుతూనే ఉంటాము.

 How To Use Onion And Garlic Peel For Stop White Hair? Stop White Hair, White Hai-TeluguStop.com

అయితే ఉల్లి, వెల్లుల్లి తొక్కల‌ను దాదాపు అంద‌రూ డస్ట్ బిన్ లోకి తోసేస్తుంటారు.అయితే అలా పారేసే ఉల్లి, వెల్లుల్లి తొక్కలతో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి.

ముఖ్యంగా వాటితో తెల్ల జుట్టు సమస్య( White hair )కు చెక్ పెట్టవచ్చు.ఇటీవల రోజుల్లో ఎంతో మంది చిన్న వయసులోనే తెల్ల జుట్టు సమస్యతో సతమతం అవుతున్నారు.

అయితే తెల్ల జుట్టు వచ్చాక బాధపడడం కన్నా రాకుండా ముందు జాగ్రత్త తీసుకోవడం ఎంతో మేలు.అందుకు ఉల్లి, వెల్లుల్లి తొక్కలు( Onion peel ) అద్భుతంగా తోడ్పడతాయి.

మరి ఇంతకీ వాటిని ఎలా ఉపయోగించాలి అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.

Telugu Black, Garlic Peel, Care, Care Tips, Peel, White-Telugu Health

ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని అందులో ఒక కప్పు ఉల్లి తొక్కలు, ఒక కప్పు వెల్లుల్లి తొక్కలు వేసుకోవాలి.అలాగే ఒక కప్పు ఎండిన కరివేపాకు వేసి వేయించుకోవాలి.మొత్తం మూడు నలుపు రంగులోకి మ‌రేంత వరకు ఫ్రై చేయాలి.

ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వేయించుకున్న కరివేపాకు, ఉల్లి, వెల్లుల్లి తొక్కల‌ను మిక్సీ జార్ లో వేసి మెత్తని పౌడర్ లా గ్రైండ్ చేసుకోవాలి.

Telugu Black, Garlic Peel, Care, Care Tips, Peel, White-Telugu Health

ఇప్పుడు ఈ పౌడర్ లో వన్ టేబుల్ స్పూన్ ఆమ్లా పౌడర్( Amla Powder ), రెండు టేబుల్ స్పూన్లు పెరుగు మరియు రెండు టేబుల్ స్పూన్లు కొబ్బరి నూనె వేసి అన్నీ కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి.ఇప్పుడు ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు పట్టించి షవర్ క్యాప్ ధరించాలి.గంట అనంతరం మైల్డ్ షాంపూ ను ఉపయోగించి శుభ్రంగా తల స్నానం చేయాలి.

వారానికి కేవలం ఒక్కసారి ఈ రెమెడీని పాటిస్తే మీ జుట్టులో మెలనిన్ ఉత్పత్తి తగ్గకుండా ఉంటుంది.దాంతో వయసు పైబడిన కూడా మీ కురులు నల్లగా నిగనిగలాడుతూ మెరుస్తాయి.

తెల్ల జుట్టు సమస్యకు దూరంగా ఉండవచ్చు.అలాగే ఈ రెమెడీని పాటిస్తే హెయిర్ ఫాల్ సైతం కంట్రోల్ అవుతుంది.

కాబట్టి తప్పకుండా ట్రై చేయండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube