ప్రముఖ టాలీవుడ్ నటి మధుమణి ( Madhumani )తాజాగా ఒక యూట్యూబ్ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇవ్వగా ఆ ఇంటర్వ్యూలో ఎన్నో ఆసక్తికర విషయాలను వెల్లడించారు.సంతోషం సినిమా షూటింగ్ సమయంలో ప్రభుదేవా గారితో ఫోటో దిగాలని ప్రయత్నించానని ఆమె అన్నారు.
ప్రభుదేవా గారిని ఫోటో అడిగితే వెంటనే ఓకే అన్నారని ఆమె పేర్కొన్నారు.ప్రభుదేవా గారు ఫస్ట్ డే కుడితిలో పడే సీన్ లో నటించడంతో ఫోటో దిగలేదని మధుమణి తెలిపారు.
అలా వరుసగా ఫోటోలు మిస్ అయ్యాయని ఆమె పేర్కొన్నారు.సంతోషం సినిమాలో ట్రైన్ ఎపిసోడ్ షూట్ సమయంలో ప్రభుదేవా గారు పిలిచి ఫోటో తీయించారని మధుమణి పేర్కొన్నారు.బ్రహ్మానందం గారితో సరదాగా ఉంటుందని ఆమె చెప్పుకొచ్చారు.కొరటాల శివ డైరెక్షన్ లో మిర్చి సినిమా( Mirchi movie )లో మాత్రమే చేశానని మధుమణి కామెంట్లు చేశారు.
ఆ సినిమాలో మంచి క్యారెక్టర్ దక్కిందని మధుమణి తెలిపారు.
కొరటాల శివ( Koratala shiva )తో పరిచయం లేకపోయినా ఆ సినిమాకు ఛాన్స్ దక్కిందని మధుమణి కామెంట్లు చేశారు.
మిర్చి సినిమా లాంటి మంచి రోల్ ఇవ్వడం అదృష్టం అని ఆమె అన్నారు.ప్రభాస్ గారిని ఫోటో అడిగితే మేకప్ తీసేస్తే ఇంత అందంగా ఉన్నారని మదర్ రోల్స్ ఎందుకు వేస్తున్నారని అన్నారని ఆమె చెప్పుకొచ్చారు.
నాకు అన్ని క్రాఫ్ట్స్ ఇష్టమని మధుమణి అభిప్రాయం వ్యక్తం చేశారు.
గంటల లెక్కన పని చేస్తున్న సమయంలో టెన్షన్ ఉంటుందని మధుమణి ( Madhumani ) కామెంట్లు చేశారు.ఇతరులను ఇబ్బంది పెట్టడం నాకు నచ్చదని ఆమె పేర్కొన్నారు.నేను ఏ సెట్ కు లేట్ గా వెళ్లలేదని మధుమణి కామెంట్లు చేశారు.
చెప్పిన టైమ్ కు నేను కచ్చితంగా వెళతానని ఆమె అన్నారు.మధుమణి చెప్పిన విషయాలు సోషల్ మీడియా వేదికగా తెగ వైరల్ అవుతుండటం గమనార్హం.