దాదాపు చాలామంది ఇళ్లలో చిన్న పిల్లలు( Children ) ఉంటారు.చిన్న పిల్లలు ఉండే ఇంట్లో నిద్రపోవడానికి అసలు వీలు ఉండదు.
మూడు సంవత్సరాల లోపు పిల్లలు ఉంటే నిద్ర అసలు ఉండదని కచ్చితంగా చెప్పొచ్చు.ఎందుకంటే ఆ ఇల్లంతా గందరగోళంగా ఉంటుంది.
ఆ పిల్లలకు ఏమి చెప్పినా అర్థం కాదు.ఇలా పగలంతా బాగానే ఉన్నా పిల్లలు రాత్రిళ్ళు మాత్రం సరిగ్గా నిద్రపోరు.
రాత్రులు చాలామంది పిల్లలు సడన్ గా నిద్రలో నుంచి లేచి ఏడుస్తూ ఉంటారు.వాళ్లకు ఏమో మాటలు సరిగ్గా రావు.
కారణం చెప్పలేరు.మనకు కూడా ఏమీ అర్థం కాదు.
కడుపులో నొప్పి, గ్యాస్, చెవి పోటు, దోమలు కుట్టడం, ఆకలి ఇలా దేని గురించో అసలు తెలుసుకోలేము.
దీంతో పేరెంట్స్ కూడా అర్ధరాత్రి సమయంలో గాడ నిద్రలో ఉండగా పిల్లలు ఏడిస్తే ఏం చేయాలో అసలు అర్థం కాదు.అయితే కొన్ని అధ్యయనాల ప్రకారం 30 శాతం మంది పిల్లలు నిద్రలేమి సమస్యలతో రాత్రులు ఏడుస్తూ ఉన్నారు.పిల్లలలో నిద్రలేమి సమస్యల( Sleeping Problems )కు కారణాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ముఖ్యంగా చెప్పాలంటే నిద్రలేమి సమస్యలతో బాధపడే పిల్లలు సాధారణంగా రాత్రి కంటే పగలే ఎక్కువగా నిద్ర పోతారు.అలాగే మరి కొంతమంది అర్ధరాత్రి దాటాక నిద్రపోతూ ఉంటారు.
ఇంకొందరు నిద్రలో సడన్ గా లేచి ఏడుస్తూ ఉంటారు.అయితే పగలు కూడా పదేపదే నిద్రపోవడం కూడా మంచి అలవాటు కాదని నిపుణులు చెబుతున్నారు.
పెద్దల మాదిరిగానే చిన్నపిల్లలకు కూడా పీడకలలు వస్తూ ఉంటాయి.కానీ ఆ విషయం మనకు తెలియదు.దీంతో చిన్న పిల్లలు రాత్రి సమయంలో నిద్రలో నుంచి లేచి ఏడుస్తూ ఉంటారు.పిల్లలకు వచ్చే పీడకలలు వారి నిద్ర పై చెడు ప్రభావాన్ని చూపుతాయి.దీంతో వారు రాత్రి సమయంలో నిద్ర పోవడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు.ఇంకా చెప్పాలంటే కొంతమంది పిల్లలు నిద్రలో గురక పెడుతూ ఉండారు.
గురక ఎందుకు వస్తుంది అంటే శ్వాసకోశ ఇన్ఫెక్షన్( Respiratory infection ) వల్ల పిల్లలకు గురక వస్తుంది.వీటి వల్ల కూడా పిల్లలు సరిగ్గా నిద్రపోరు.
ఇంకా చెప్పాలంటే పిల్లల కండరాలపై ఒత్తిడి, శ్వాస అడగడం చెమట పట్టడం వంటి సమస్యలు కూడా కారణం అవుతాయి.అప్పుడప్పుడు ఇలా చేస్తే పర్వాలేదు.
కానీ ఎప్పుడూ ఇలా చేస్తూ ఉంటే వైద్యులను సంప్రదించడం మంచిది.