వన్ ప్లస్ పాడ్ గో టాబ్లెట్ ధర, ఫీచర్స్ ఇవే..!

చైనీస్ టెక్ బ్రాండ్ వన్ ప్లస్( One Plus ) ఎంత మంచి ఆదరణ పొందిందో అందరికీ తెలిసిందే.భారత మార్కెట్ లోకి రెండవ టాబ్లెట్ వన్ ప్లస్ పాడ్ గో టాబ్లెట్ ను( OnePlus Pad Go Tablet ) కంపెనీ త్వరలోనే తీసుకురానుంది.

 Oneplus Pad Go Tablet Price And Features Details, Oneplus Pad Go Tablet, Oneplus-TeluguStop.com

అయితే కంపెనీ ఈ విషయాన్ని అధికారికంగా ఇంకా వెల్లడించలేదు.కానీ బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్( BIS ) వెబ్సైట్ లో ఈ సరికొత్త టాబ్లెట్ కు సంబంధించిన వివరాలు కనిపించాయి.

ఆ వెబ్సైట్ లో మోడల్ నెంబర్ OPD2304 మరియు OPD2305 తో ఇవి కనిపించాయి.

ఆ తర్వాత కాసేపటికి అవి డిలీట్ చేయబడ్డాయి.ఈ సరికొత్త టాబ్లెట్ ధర ఇంకా ఫీచర్స్ గురించి అధికారికంగా ఎలాంటి సమాచారం తెలియలేదు.కేవలం మోడల్ నెంబర్ మాత్రమే తెలిసింది.ఇప్పటికే మార్కెట్ లో ఉన్న వన్ ప్లస్ పాడ్( OnePlus Pad ) అప్ గ్రేడ్ అయి మార్కెట్ లోకి వస్తుందని అనుకుంటున్నారు.2023 ఫిబ్రవరిలో కంపెనీ క్లౌడ్ లెవెన్ ఈవెంట్ లో వన్ ప్లస్ పాడ్ ను ఆవిష్కరించారు.

ఈ టాబ్లెట్ బ్యాకప్ కోసం 9510mAh బ్యాటరీతో వచ్చింది.ఏప్రిల్ లోనే మార్కెట్ లోకి అందుబాటులో వచ్చింది.ఈ టాబ్లెట్ ధర రూ.37999 గా ఉంది.ఇది 8GB RAM+ 128GB ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ ను కలిగి ఉంది.ఇక 12GB RAM+ 256GB ఇంటర్నల్ స్టోరేజ్ ను కలిగి ఉన్న టాబ్లెట్ ధర రూ.39999 గా ఉంది.కాకపోతే ఈ టాబ్లెట్ కేవలం ఒక్క కలర్ లో మాత్రమే మార్కెట్ లోకి వచ్చింది.

సింగిల్ ఫినిష్ కలర్ ఆప్షన్ తో మాత్రమే ఈ సరికొత్త టాబ్లెట్ అందుబాటులో ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube