ఏలూరులో మరో దారుణం మహిళను గొంతు కోసి హత్య..!!

ఏలూరు జిల్లా( Eluru ) కేంద్రంలో వరుసగా మహిళలపై దాడులు జరుగుతున్నాయి.కొద్ది నెలల క్రితం దంత వైద్య కళాశాలలో పనిచేస్తున్న వివాహితపై యాసిడ్ దాడి చేయడం తెలిసింది.

 Another Atrocity In Eluru, A Woman Was Killed By Strangulation Crime News, Elur-TeluguStop.com

ఈ ఘటనలో బాధితురాలు చికిత్స పొందుతూ మరణించడం జరిగింది.అయితే ఈ ఘటన జరిగిన తర్వాత ఇటీవల వారం రోజుల క్రితం ఏలూరు పట్టణం గణేష్ నగర్ లో మహిళ( woman )పై హరి అనే వ్యక్తి రాడ్డుతో దాడి చేయడం జరిగింది.

ఈ ఘటనలో గాయపడ్డ సదరు మహిళా ఇంకా ఆసుపత్రిలోనే చికిత్స తీసుకుంటూ ఉంది.

ఇదిలా ఉంటే తాజాగా ఇప్పుడు ఏలూరు పట్టణం( Eluru )లో శనివారం పేటకు చెందిన ఉడత సుజాత అనే మహిళను ఆమె ప్రేమికుడు దిమ్మిటి సత్యనారాయణ స్వామి విచక్షణ రహితంగా గొంతు కోసి హత్య చేశాడు.

అనంతరం నూజివీడు రైల్వే స్టేషన్ సమీపంలో సత్యనారాయణ స్వామి రైలు కిందపడి మృతి చెందడం జరిగింది.ఈ సంఘటన ఏలూరు నగరంలో సంచలనం కలిగించింది.రక్తపు మడుగులో ఉడత సుజాత మృతదేహం ( Dead body )చూసి కుటుంబ సభ్యులు కన్నీరు అయ్యారు.ఏలూరు జిల్లా కేంద్రంలో వరుసగా మహిళలపై జరుగుతున్న దాడులు స్థానికంగా ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube