రాజన్న సిరిసిల్ల జిల్లా:బయోస్టాడ్ ఇండియా లిమిటెడ్( Biostad India Limited ) కంపెనీవారు బయోజైం 37 సంవత్సరాలు వసంతాలు పూర్తి చేసుకొని జడ్.పి.
హెచ్.ఎస్ స్కూల్ ఎల్లారెడ్డిపేట ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న నినిరుపేద రైతు కుటుంబాల విద్యార్థులకు స్కాలర్షిప్లు అందజేయడం జరిగింది.
ఇందులో ఒక్కొక్క విద్యార్థికి 2500 చొప్పున 10 మందికి 25,000 రూపాయల స్కాలర్షిప్ అందజేయడం జరిగింది.ఇలాగే నిరుపేద విద్యార్థులు బాగా చదువుకొని ఎత్తైన శిఖరాలు అధిరోహించాలని అన్నారు.
దీనికి కంపెనీ వారికి హెచ్ ఎం హనుమానులు కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో స్థానిక ఉపసర్పంచ్ ఒగ్గు రజిత బాలరాజు యాదవ్, హెచ్ఎం హనుమాన్లు , ఉపాధ్యాయులు ముత్యాల శ్రీనివాస్ రెడ్డి గర్గుల స్వామి రాచార్ల వెంకన్న వేణుగోపాల్ రావు బయోస్టాడ్ కరీంనగర్ జిల్లా మేనేజర్ బత్తిని తిరుపతి, కరీంనగర్ డిస్ట్రిబ్యూటర్ హనుమాన్ ఆగ్రోస్ మహేశ్, లోకల్ డీలర్స్ భాస్కర్ అశోక్ భార్గవ్ బిక్షపతి, రైతులు కంపెనీ ప్రతినిధులు ఇతర స్కూల్ టీచర్స్ పాల్గొనడం జరిగింది.