అమెరికా అధ్యక్ష ఎన్నికలు .. భారతదేశంతో నా విధానం ఇలా : వివేక్ రామస్వామి ఏమన్నారంటే

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ( Republican Party ) తరపున పోటీ చేస్తున్న భారత సంతతికి చెందిన వివేక్ రామస్వామి( Vivek Ramaswamy ) ప్రచారంలో దూసుకెళ్తున్నారు.డిబేట్లు, ర్యాలీలు, ఇంటర్వ్యూలు, ఫండ్ రైజింగ్ కార్యక్రమాలతో ముందుకు వెళ్తున్నారు.9/11 దాడులు, ఉక్రెయిన్ యుద్ధం వంటి అంశాలపై కీలక వ్యాఖ్యలు చేశారు.రష్యా, ఇండియా, చైనాల పట్ల అతని అభిప్రాయాలు మెజారిటీ అమెరికన్లకు ఆసక్తిని కలిగిస్తున్నాయి.

 Us Presidential Candidate Vivek Ramaswamy Grand Plans For Trust-based Relationsh-TeluguStop.com

ఆగస్ట్ 17న నిక్సన్ లైబ్రరీలో వివేక్ మాట్లాడుతూ.చైనాను ఎదుర్కోవడానికి భారత్‌తో( India ) సంబంధాలను మెరుగుపరచుకోవడం, బీజింగ్‌కు మధ్య ప్రాచ్య దేశాల నుంచి చమురు యాక్సెస్‌ను నిరోధించడం సహా పలు అంశాలపై తన విధానాలను పంచుకున్నారు.

రష్యా – చైనా కూటమిని అమెరికా ఎదుర్కొంటున్న అతిపెద్ద సైనిక ముప్పుగా పేర్కొన్న వివేక్.వ్లాదిమిర్ పుతిన్( Vladimir Putin ) చైనా కూటమి నుంచి వైదొలగాలని కోరాడు.

పుతిన్‌ను కొత్త మావోగా అభివర్ణించిన ఆయన.పుతిన్, జిన్‌పింగ్‌లను కట్టడి చేస్తామని తెలిపారు.

రష్యాను చైనా నుంచి వేరు చేయడంలో భాగంగా భారత్‌తో భాగస్వామ్యానికి నిబద్ధతతో పనిచేస్తానని వివేక్ చెప్పారు.యుద్ధాన్ని తప్పించేలా తైవాన్‌ను వెంబడించకుండా జిన్‌పింగ్‌ను( Xi Jinping ) అరికట్టడానికి అమెరికా ప్రయత్నించాలన్నారు.

ఇందుకోసం రష్యాను చైనా నుంచి వేరు చేయడం మొదటిదన్నారు.తైవాన్( Taiwan ) చుట్టూ తలెత్తే సంఘర్షణ నేపథ్యంలో అవసరమైతే అండమాన్ సముద్రాన్ని, మలక్కా జలసంధిని మూసివేయడం వంటి కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సి వుంటుందన్నారు.

చిలీ, ఆస్ట్రేలియాతో మనకు ఇప్పటికే వున్న వాణిజ్య ఒప్పందాన్ని భారత్‌కు ఇస్తే.ఇండియా ఆ పనిని సంతోషంగా చేస్తుందన్నారు.

Telugu China, Donald Trump, India, Nixon Library, Ran Desantis, Republican, Russ

భారత్‌తో విశ్వసనీయ సంబంధాన్ని మెరుగుపరచడానికి అవకాశం కల్పిస్తానని వివేక్ హామీ ఇచ్చారు.ఇరుదేశాల మధ్య సరైన సంభాషణలు లేవని.తన పదవీకాలం ముగిసేలోగా తాను దానిని పూర్తి చేస్తానని , లేనిపక్షంలో అది తన వ్యక్తిగత వైఫల్యంగానే భావిస్తానని రామస్వామి వ్యాఖ్యానించారు.ఇక వలస విధానంపైనా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.

తన తల్లిదండ్రులు చేతిలో డబ్బు లేకుండా 40 ఏళ్ల క్రితం అమెరికాకు( America ) వచ్చారని గుర్తుచేశారు.ఇప్పుడు నా పిల్లలు సహా ఎంతోమంది జాతీయ గుర్తింపు సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారని వివేక్ తెలిపారు.

Telugu China, Donald Trump, India, Nixon Library, Ran Desantis, Republican, Russ

ఇకపోతే.అమెరికా అధ్యక్ష ఎన్నికల సరళి, ఎవరు ముందంజలో వున్నారనే దానిపై పలు ఏజెన్సీలు సర్వేలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.తాజాగా ఎమర్సన్ కాలేజీ పోల్‌లో రిపబ్లికన్ అధ్యక్ష అభ్యర్ధులుగా నిలిచిన డిసాంటిస్,( Ran Desantis ) రామస్వామిలు పది శాతం చొప్పున సంయుక్తంగా రెండో స్థానంలో నిలిచారు.మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్( Donald Trump ) 56 శాతంతో రిపబ్లికన్‌లలో అందరికంటే టాప్‌లో నిలిచారు.

ఈ మేరకు ది హిల్ నివేదించింది.

Telugu China, Donald Trump, India, Nixon Library, Ran Desantis, Republican, Russ

జూన్‌లో 21 శాతం ప్రజా మద్ధతుతో సెకండ్ ప్లేస్‌లో నిలిచిన డిసాంటిస్ తాజా ఎమర్సన్ కాలేజ్ పోల్ ప్రకారం 10 శాతానికి పడిపోవడం గమనార్హం.మరోవైపు రామస్వామి 2 శాతం నుంచి ఏకంగా డిసాంటిస్‌తో సమానంగా నిలవడం విశేషం.రామస్వామి మద్ధతుదారులలో సగం మంది ఖచ్చితంగా ఆయనకు ఓటు వేస్తారని సర్వే తెలిపింది.

అయితే డిసాంటిస్ మద్ధతుదారులలో మూడింట ఒక వంతు మాత్రమే ఓటింగ్‌కు అనుకూలంగా వున్నట్లు చెప్పారని ది హిల్ పేర్కొంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube