సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో ఆలిండియా స్థాయిలో ఫస్ట్ ర్యాంక్ సాధించాలంటే ఏ స్థాయిలో కష్టపడాలో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.అంకుర్ గార్గ్ అనే వ్యక్తి 22 సంవత్సరాల వయస్సులోనే ఆలిండియా స్థాయిలో ఫస్ట్ ర్యాంక్ సాధించారు.
యూపీఎస్సీ పరీక్షలో పాస్ కావాలనే కలను అంకుర్ గార్గ్( Ankur garg ) ఎంతో కష్టపడి నెరవేర్చుకున్నారు.ప్రతి సంవత్సరం లక్షల సంఖ్యలో అభ్యర్థులు ఈ పరీక్షల కోసం కష్టపడుతూ ఉంటారు.
ఈ పరీక్షలలో సత్తా చాటడానికి చాలాసార్లు ప్రయత్నించిన వాళ్లు సైతం ఎక్కువగానే ఉన్నారు.అయితే ఎంతోమంది నుంచి పోటీ ఎదురైనా రేయింబవళ్లు లక్ష్య సాధన కోసం కష్టపడి అంకుర్ గార్గ్ తన కలను నెరవేర్చుకున్నారు.2002 సంవత్సరంలో యూపీఎస్సీ సివిల్ టాపర్ గా నిలిచిన అంకుర్ గార్గ్ ఐఏఎస్ లో చేరి సేవలు అందించడం గమనార్హం.ఐఐటీ ఢిల్లీ( IIT Delhi ) నుంచి ఈసీఈలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన అంకుర్ గార్గ్ ఐఏఎస్ గా ఎంపికైన తర్వాత కూడా చదువును కొనసాగించారు.
హార్వర్డ్ యూనివర్సిటీ( Harvard University )లో ఎకనామిక్స్ లో మాస్టర్స్ పూర్తి చేసిన అంకుర్ గార్గ్ 1980 సంవత్సరంలో పాటియాలలో జన్మించారు.చిన్న వయస్సులో ఐఏఎస్ కావడంతో అంకుర్ అరుదైన ఘనతను ఖాతాలో వేసుకున్నారు.అంకుర్ తల్లీదండ్రులు ఇద్దరూ డాక్టర్లు కావడం గమనార్హం.అంకుర్ సోదరి కూడా డాక్టర్ కాగా హిందీ, ఇంగ్లీష్, బెంగాళీ ఇతర భాషల్లో సైతం అంకుర్ అద్భుతంగా మాట్లాడగలరు.
అంకుర్ భార్య పేరు స్వాతిశర్మ( Swathi Sharma ) కాగా అంకుర్ దంపతులకు ఇద్దరు కూతుళ్లు ఉన్నారు.సోషల్ మీడియాలో అంకుర్ గార్గ్ కు భారీ స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.ఐఏఎస్ అంకుర్ గార్గ్ తన సక్సెస్ స్టోరీతో ఎంతోమందికి స్పూర్తిగా నిలిచారని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.అంకుర్ గార్గ్ టాలెంట్ గురించి, ఆయన సక్సెస్ స్టోరీ గురించి తెలిసి నెటిజన్లు సైతం ఫిదా అవుతున్నారు.