గ్లోబల్ స్టార్ ధనుష్ ( Dhanush ) ప్రజెంట్ ఫుల్ జోష్ లో ఉన్నాడు.వరుసగా సూపర్ హిట్స్ అందుకుంటూ కేరీర్ లో దూసుకు పోతున్నాడు.
ఇటీవలే ధనుష్ టాలీవుడ్ డైరెక్టర్ డైరెక్టర్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో ‘సార్‘ ( Sir Movie ) సినిమా చేయగా సూపర్ హిట్ అయ్యింది.తెలుగు, తమిళ్ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ కాగా ఈయన కెరీర్ లో 100 కోట్లను దాటేసిన మరో మూవీగా నిలిచింది.
ధనుష్ సార్ వంటి సినిమాతో మంచి జోష్ లోకి వెళ్లిపోయారు.ఈ క్రమంలోనే వరుసగా సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ మంచి స్వింగ్ లో ఉన్నారు.
మరి ధనుష్ సార్ కంటే ముందుగానే మరో తెలుగు డైరెక్టర్ కు ఓకే చెప్పిన విషయం విదితమే.ఆయన శేఖర్ కమ్ముల.
ఈయనతో ధనుష్ సినిమా ఎప్పుడో ఫైనల్ అయినప్పటికీ ముందుగా ధనుష్ సార్ సినిమాను పూర్తి చేసాడు.
ఇక ఇప్పుడు ఈ సినిమాను మొదలెట్టనున్నారు.ప్రస్తుతానికి ”D51” అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కనున్న ఈ సినిమాలో హీరోయిన్ ను ఈ రోజు కొద్దిసేపటి క్రితం అఫిషియల్ గా ప్రకటించారు.నేషనల్ క్రష్ రష్మిక మందన్న ( Rashmika Mandanna ) హీరోయిన్ గా ఫిక్స్ చేసినట్టు ప్రకటించారు.
ధనుష్ ఇంకా శేఖర్ కమ్ముల ( Sekhar Kammula )తో రష్మిక మొదటిసారి పనిచేయనుంది.
సౌత్ లో మరో పెద్ద ప్రాజెక్ట్ లో అవకాశం అందుకుని అమ్మడు లక్కీ చామ్ అని మరోసారి నిరూపించుకుంది. ఇక ఈ సినిమాను ( D51 ) అమిగోస్ క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ తో కలిసి శ్రీ వెంకటేశ్వర సినిమాస్ వారు LLP బ్యానర్ పై ఈ సినిమాను నిర్మిస్తున్నారు.ఎట్టకేలకు ఈ సినిమాలో హీరోయిన్ ను ప్రకటించి హైప్ అయితే పెంచేశారు.
మరి ఎప్పుడు లాంచ్ చేసి షూట్ స్టార్ట్ చేస్తారో చూడాలి.