మామూలుగా సినీ ఇండస్ట్రీకి చెందిన సెలబ్రెటీలు తమ వ్యక్తిగత విషయాలలో వార్తలలో హైలెట్గా నిలుస్తూ ఉంటారు.ముఖ్యంగా వారి ప్రేమ, పెళ్లి, విడాకుల వ్యవహారంతో హాట్ టాపిక్ గా వైరల్ అవుతూ ఉంటారు.
అయితే తాజాగా ఇప్పుడు ఓ టాలీవుడ్ ఆర్టిస్ట్ నెట్టింట్లో బాగా వైరల్ అవుతుంది.ఇంతకు ఆమె ఎవరో కాదు సురేఖవాణి.
తాజాగా ఆమె రెండో పెళ్లి చేసుకున్నట్టు ఒక వార్త జోరుగా వినిపిస్తుంది.అసలు ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం.
యాంకర్ గా కెరీర్ మొదలు పెట్టిన సురేఖవాణి( Surekhavani ) ఆ తర్వాత వెండితెరపై సైడ్ ఆర్టిస్ట్ గా అవకాశం అందుకొని ఇప్పటికీ ఎన్నో సినిమాలలో హీరో, హీరోయిన్లకు పిన్నిగా, అత్తగా, అక్కగా చేసింది.ఇప్పటికీ ఇండస్ట్రీలో అంతే ఊపుగా కొనసాగుతుంది.
ఇక ఈమెకు పెళ్లయి తనెత్తు కూతురు కూడా ఉన్న సంగతి అందరికీ తెలిసిందే.కూతురు పేరు సుప్రీత.
ఈమె కూడా తల్లి ద్వారా, సోషల్ మీడియా ద్వారా అందరితో పరిచయాన్ని పెంచుకుంది.ఇక సురేఖ వాణి భర్త మరణించిన సంగతి తెలిసిందే.
ఇక భర్తను కోల్పోయిన కూతురే తన ప్రపంచం అన్నట్లుగా బ్రతుకుతుంది.తన భర్త చనిపోయిన కొంతకాలానికి ఆమె రెండో పెళ్లి చేసుకుంటుందని జోరుగా వార్తలు అయితే వచ్చాయి.
కానీ అవన్నీ పుకార్లు అని తల్లి కూతుర్లు ఇద్దరు చెప్పుకొచ్చారు.ఆ తర్వాత కొంతకాలానికి సుప్రీత తన తల్లి సంతోషంగా ఉంటుంది అంటే రెండో పెళ్లి కూడా చేస్తాను అని ఓ ఇంటర్వ్యూలో కామెంట్లు చేసింది.
కానీ ఇప్పటివరకు మళ్ళీ రెండవ పెళ్లి గురించి చర్చ రాలేదు.అయితే గతంలో సురేఖ కు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని కూడా వార్తలు వినిపించాయి.కారణం ఏంటంటే తనలో వచ్చిన మార్పు వల్లే ఇటువంటి వార్తలు వినిపించాయి.భర్త చనిపోయిన కొన్ని రోజులకే సోషల్ మీడియాలో అడుగుపెట్టి కూతురుతో పోటీగా పొట్టి పొట్టి బట్టలు వేస్తూ కూతురికే అక్క మాదిరిగా తయారయ్యి తన అందాలతో బాగా రచ్చరచ్చ చేయడం మొదలుపెట్టింది.
అంతేకాదు పబ్ లంటూ, లేట్ నైట్ పార్టీలు అంటూ బాగా రెచ్చిపోయింది.దీంతో ఆమె అలా మారిపోవటంతో చాలామంది విమర్శలు చేయడం మొదలుపెట్టారు.కూతురికి మంచి విషయాలు నేర్పాల్సిన నువ్వే కూతురు కంటే ఘోరంగా తయారవుతున్నారు అంటూ బాగా కామెంట్లు చేస్తుంటారు.ఇక అవన్నీ పట్టించుకోకుండా ఇద్దరు బాగా చెలరేగిపోతూ ఉంటారు.
ఖాళీ సమయం దొరికితే చాలు విదేశాలలో తిరుగుతూ ఉంటారు.ఏ తల్లి కూతుర్లు ఎంజాయ్ చేయనంత ఈ తల్లి కూతుర్లు ఎంజాయ్ చేస్తూ ఉంటారు.అయితే ఇదంతా పక్కన పెడితే రీసెంట్ గా వారిద్దరు ఒక గుడికి వెళ్ళినట్లు కనిపించారు.అయితే అక్కడ ఇద్దరు కలిసి దిగిన ఫోటోలు పంచుకున్నారు.
ఆ ఫోటోలో ఇద్దరు పద్ధతి గానే కనిపించారు.కానీ సురేఖవాణిలో కొన్ని గమనించిన జనాలు ఆమెపై అనుమానం పడుతున్నారు.
మామూలుగా హిందూ సంప్రదాయం ప్రకారం భర్త చనిపోతే ఏ స్త్రీ నుదుట కుంకుమ పెట్టుకోదు.కానీ ఇప్పటికే సురేఖ వాణి చాలాసార్లు అలా కనిపించింది.
సినిమాల వరకు మాత్రం అలా ఉండటం తప్పదు.కానీ నిజజీవితంలో కూడా ఆమె అలా కనిపించడంతో.
పైగా ఆమె మెడలో మంగళసూత్రం ఉన్నట్లు కనిపించడంతో తను రెండో పెళ్లి చేసుకుందంటూ.తను బొట్టు పెట్టుకోవటమే పెద్ద ప్రూఫ్ అంటూ కామెంట్లు చేస్తున్నారు.
మరి దీని గురించి సురేఖ ఏమని స్పందిస్తుందో చూద్దాం.