ఏడాదికి రెండుసార్లు కాపునిచ్చే పునాస మామిడి తో ఆదాయం లక్షల్లో..!

మామిడిపండు( Mango ) అంటే ఇష్టపడని వారు అంటూ ఎవరు ఉండరు.ఎంతోమంది మామిడి పండ్ల సీజన్ కోసం ఎదురుచూస్తూ ఉండడంతో మార్కెట్లో మామిడి పండ్లకు ఏడాది పొడవునా మంచి డిమాండ్ ఉంటుంది.

 Income Is In Lakhs With Punasa Mangoes That Ripen Twice A Year , Mango, Agricul-TeluguStop.com

ధర ఎంత ఎక్కువైనా మామిడి పండ్లు కొనడానికే అందరూ ఇష్టపడతారు.మామిడి ఏడాదికి ఒకసారి మాత్రమే కాపునిస్తుంది.

కానీ పునాస మామిడి మాత్రం ఏడాదికి రెండుసార్లు కాపునిచ్చి కాసుల వర్షం కురిపిస్తుంది.సాంప్రదాయ పద్ధతిలో ఈ పునాస మామిడి సాగు( Punasa mangoes ) చేయవచ్చు.

మన ఆంధ్రప్రదేశ్ లోని కొన్ని జిల్లాలలో ఉండే రైతులు ఈ పంటపై అవగాహన కల్పించుకొని సాగు చేస్తూ మంచి దిగుబడి పొంది లాభాలు అర్జిస్తున్నారు.

Telugu Agriculture, Latest Telugu, Mango, Punasa Mangoes-Latest News - Telugu

ఈ పునాస మామిడి వేసిన రెండు సంవత్సరాలలోపే పూత, కాయ రావడం జరుగుతుంది.ఈ రకం మామిడి ప్రత్యేకత ఏమిటంటే అన్ సీజన్లో కూడా కాపునిస్తుంది.ఈ మామిడిని ఏక పంటగా సాగు చేస్తారు.

ఈ మామిడి పండ్లకు చీడపీడల బెడద లేకుండా ఉండేందుకు మామిడికాయ అనేది నిమ్మకాయ సైజులో ఉన్నప్పుడు కాస్మోటిక్ ఫ్రూట్ ప్రొడక్షన్ బ్యాగ్ ( Cosmetic Fruit Production Bag )ను తగిలించాలి.నీటిని సాధారణ పద్ధతిలో కాకుండా డ్రిప్ విధానం ద్వారా అందిస్తే మొక్క ఆరోగ్యవంతంగా పెరిగి మంచి దిగుబడి ఇస్తుంది.

Telugu Agriculture, Latest Telugu, Mango, Punasa Mangoes-Latest News - Telugu

రెండు తెలుగు రాష్ట్రాలలో ఉండే నేలలు ఈ పునాస మామిడి పంటను సాగు చేయడానికి చాలా అనుకూలంగా ఉంటాయి.మొక్కలకు వివిధ రకాల తెగుళ్లు, చీడపీడల బెడద ఉన్నట్లయితే రసాయన ఎరువులను కాకుండా కేవలం కషాయాలు మాత్రమే తయారుచేసి మొక్కలు పూర్తిగా తడిచేటట్లు పిచికారి చేయాలి.రసాయన ఎరువులకు, రసాయన పిచికారి మందులకు ఎంత తక్కువ ప్రాధాన్యం ఇస్తే.అంత ఎక్కువ ఆరోగ్యకరంగా మొక్కలు ఉంటాయి.ఎకరం పొలంలో దాదాపుగా 650 మొక్కలు నాటుకోవచ్చు.ఒక చెట్టు దాదాపుగా 30 కాయల దిగుబడి ఇస్తుంది.

ఈ పంటకు తీవ్ర నష్టం కలిగించేవి కేవలం రసం పీల్చే పురుగులు మాత్రమే.కాబట్టి కాస్మోటిక్ ఫ్రూట్ ప్రొడక్షన్ బాక్స్ తగిలిస్తే ఈ పురుగుల బెడద ఉండదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube