ఏపీ వ్యాప్తంగా ఖాళీగా ఉన్న సర్పంచ్ మరియు వార్డు మెంబర్ల భర్తీకి రంగం సిద్ధం అయింది.ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఎన్నికల షెడ్యూల్ ను గెజిట్ నంబర్ 26 ద్వారా విడుదల చేసింది.
రాష్ట్రంలో వివిధ కారణాల వలన గ్రామ పంచాయతీలలో ఖాళీ అయిన సర్పంచ్ లు, వార్డు మెంబర్లను ప్రత్యక్ష ఎన్నికల ద్వారా ఎన్నుకోనున్నారు.కాగా మొత్తం 1033 గ్రామ పంచాయతీలలో 66 సర్పంచ్ పదవితో పాటు 1063 వార్డు మెంబర్ల పదవులు ఖాళీ అయ్యాయని సమాచారం.
ఈ క్రమంలో గ్రామ పంచాయతీల్లో ప్రజా ప్రతినిధుల పదవులకు గానూ రేపు రిటర్నింగ్ అధికారులు నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు.ఈ క్రమంలోనే రేపు ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్లు దాఖలు చేసే అవకాశం ఉంది.ఆగస్ట్ 10 వ తేదీ సాయంత్రం 5 వకు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ కొనసాగనుంది.11వ తేదీన నామినేషన్ల పరిశీలన, ఆగస్ట్ 14 మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల ఉప సంహరణ ప్రక్రియకు సమయం ఇచ్చారు.అనంతరం 19న ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్, అదే రోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభం కానుందని అధికారులు నోటిఫికేషన్ లో వెల్లడించారు.