వచ్చే సార్వత్రిక ఎన్నికలను( General Elections ) దృష్టిలో పెట్టుకుని పార్టీలో అనేక కీలక మార్పులకు శ్రీకారం చుట్టారు వైసీపీ అధినేత, సీఎం జగన్.వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా నిర్ణయించుకున్న జగన్ పార్టీ లోను ప్రక్షాళన చేపట్టారు అలాగే కీలకమైన వ్యక్తులకు కీలకమైన బాధ్యతలను అప్పగిస్తున్నారు.
ఇప్పటి వరకు తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ గా బాధ్యతలు నిర్వహిస్తూ వస్తున్న తన బంధువు సుబ్బారెడ్డిని తప్పించి , ఆస్థానంలో భూమన కరుణాకర్ రెడ్డిని జగన్ నియమించారు.
గతంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు టీటీడీ చైర్మన్ గా భూమన కరుణాకర్ రెడ్డి( Bhumana Karunakar Reddy ) పని చేశారు.ఇప్పుడు మరోసారి ఆయనకు అవకాశం దక్కింది.దీంతో ఇప్పుడు సుబ్బారెడ్డి పరిస్థితి ఏమిటనేది ఆసక్తికరంగా మారింది .అయితే ఢిల్లీ రాజకీయాల్లో కీలకంగా వ్యవహరించేందుకు, ఎన్నికలకు సంబంధించి అనేక వ్యూహాలను అమలు చేయాల్సి ఉన్న నేపథ్యంలో, సుబ్బారెడ్డిని టిటిడి చైర్మన్ గా తప్పించి ఢిల్లీ బాధ్యతలు అప్పగించాలనే ఆలోచనతో జగన్ ఉన్నారట.
వైసీపీ ఆవిర్భావం నుంచి సుబ్బారెడ్డి పార్టీ వ్యవహారాల్లో కీలకంగా వ్యవహరిస్తున్నారు.ఇప్పుడు ఎన్నికల సమయం దగ్గర పడుతుండడంతో ఢిల్లీ వేదికగా పార్టీ వ్యవహారాలు, రాజకీయ పరిణామాలను పరిశీలించి మరోసారి వైసీపీ( YCP ) అధికారంలోకి వచ్చే విధంగా చేసేందుకు , ఢిల్లీ బిజెపి పెద్దలతో సన్నిహితంగా మెలుగుతూ, వచ్చే ఎన్నికల్లో ఎటువంటి ఇబ్బందులు లేకుండా చేసుకునే విధంగా సుబ్బారెడ్డి చక్రం తిప్పనున్నారట.పార్లమెంట్ లో అత్యధిక ఎంపీలు ఉన్న పార్టీగా వైసిపి నాలుగో స్థానంలో ఉంది.
దీంతో కేంద్రంలో వైసీపీ కీలకంగా వ్యవహరిస్తోంది .మరో తొమ్మిది నెలల్లో ఎన్నికలు జరగబోతూ ఉండడం తో పార్టీ కార్యకర్తలపై పూర్తిగా దృష్టి పెట్టేందుకు, తనకు అత్యంత నమ్మకస్తుడైన సుబ్బారెడ్డికి ఢిల్లీలో పార్టీ వ్యవహారాల బాధ్యతలను అప్పగించనున్నారట.ఇప్పటికే వైసిపి రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి( Vijaya Sai Reddy ) ఢిల్లీలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఎప్పటికప్పుడు కేంద్ర బిజెపి పెద్దలతో టచ్ లో ఉంటూ పార్టీకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూస్తున్నారు .ఇప్పుడు సుబ్బారెడ్డి కూడా విజయ్ సాయి రెడ్డి బాధ్యతలను పంచుకునే విధంగా ఆయనకు జగన్ బాధ్యతలు అప్పగించబోతున్నారట.