టాలీవుడ్ ఇండస్ట్రీలో విభిన్నమైన పాత్రల్లో నటించి ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్న అతికొద్ది మంది నటులలో జగపతిబాబు ఒకరు.జగపతిబాబు( Jagapathi Babu) హీరోగా నటించినా విలన్ గా నటించినా తన పాత్రకు పూర్తిస్థాయిలో న్యాయం చేస్తారు.
జగపతిబాబు రెమ్యునరేషన్ కూడా భారీ స్థాయిలో ఉంది.వివాదాలకు దూరంగా ఉండే హీరో అవసరమైతే బోల్డ్ గా మాత్రం మాట్లాడతాడని సినిమా ఇండస్ట్రీలో టాక్ ఉంది.
అయితే ఒకానొక సందర్భంలో జగపతిబాబు వందల కోట్ల రూపాయల ఆస్తులను పోగొట్టుకున్నారు.తండ్రి ఇచ్చిన ఆస్తితో పాటు సంపాదించిన ఆస్తిని సైతం అతను పోగొట్టుకోవడం గమనార్హం.అయితే లెజెండ్ మూవీ( LEGEND movie )లో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించడం ఆయనకు వరమైంది.ఈ సినిమాలోని విలన్ రోల్ లో జీవించి భారీ విజయాన్ని జగపతి బాబు ఖాతాలో వేసుకున్నారు.
నాన్నకు ప్రేమతో( Nannaku Prematho ), అరవింద సమేత వీర రాఘవ, శ్రీమంతుడు, రంగస్థలం, మరికొన్ని సినిమాలు ఆయనకు మంచి పేరు తెచ్చిపెట్టాయి.
జగపతిబాబుకు క్యాసినో, గ్యాంబ్లింగ్ అలవాటు ఉండగా ఈ అలవాటు వల్ల ఆయన కొంత మొత్తాన్ని పోగొట్టుకున్నారు.దుబారాగా ఖర్చులు చేయడం, స్నేహితులకు డబ్బులు ఇవ్వడం, ఇతర కారణాల వల్ల డబ్బు విషయంలో తీవ్రస్థాయిలో జగపతిబాబు నష్టపోయాడు.30 కోట్ల రూపాయల సంపాదన టార్గెట్ గా జగపతిబాబు సినిమాలలో నటించారు.అయితే తక్కువ సమయంలోనే సులభంగా జగపతిబాబు ఆ లక్ష్యాన్ని సాధించడం జరిగింది.
సెకండ్ ఇన్నింగ్స్ లో సంపాదించిన డబ్బు విషయంలో ఎలాంటి పొరపాట్లు జరగకుండా జగపతిబాబు జాగ్రత్త పడుతున్నారు.జగపతిబాబు కెరీర్ పరంగా మరిన్ని సక్సెస్ లను సొంతం చేసుకోవాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.జగపతిబాబు ప్రధాన పాత్రలో పలు సినిమాలు తెలుగులో తెరకెక్కుతుండటం గమనార్హం.
ప్రముఖ నటుడు జగపతిబాబును అభిమానించే వాళ్ల సంఖ్య అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం.