పుష్ప రాజ్‌ ను భయపెడుతున్న అల్లూరి, కొమురం భీమ్‌

అల్లు అర్జున్‌,( Allu Arjun ) సుకుమార్ కాంబోలో రూపొందుతున్న పుష్ప 2 సినిమా( Pushpa 2 movie ) పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి అనడంలో సందేహం లేదు.వీరి కాంబోలో వచ్చిన పుష్ప సినిమా దాదాపుగా రూ.400 కోట్ల వసూళ్లు రాబట్టింది.అందుకే పుష్ప 2 ను వెయ్యి కోట్ల టార్గెట్ గా ఈ సినిమా ను విడుదల చేయబోతున్నట్లుగా తెలుస్తోంది.

 Pushpa 2 Movie Release Date Change Due To Rrr Heroes Movies , Pushpa 2 Movie, Al-TeluguStop.com

ఇక ఈ సినిమా ను హిందీ తో పాటు ఇతర భాషల్లో విడుదల చేయబోతున్నారు.విదేశీ భాష ల్లో కూడా ఈ సినిమా ను విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు.

Telugu Rrr, Allu Arjun, Devara, Game Changer, Pushpa, Ram Charan, Tollywood-Movi

హాలీవుడ్ రేంజ్ లో ఈ సినిమా ను విడుదల చేసేందుకు సిద్ధం అవుతున్నట్లుగా యూనిట్‌ సభ్యులు పేర్కొన్నారు.ఇలాంటి సమయంలో పుష్ప 2 సినిమా విడుదల తేదీ విషయం లో మేకర్స్ ఒక నిర్ణయానికి రాలేక పోతున్నారు.షూటింగ్ ఇంకా పెండ్డింగ్ ఉన్న కారణంగా ఈ ఏడాది సినిమా ను విడుదల చేయడం సాధ్యం అయ్యే పరిస్థితి లేదు.వచ్చే ఏడాది సంక్రాంతికి అని మొదట అనుకున్నారు.

కానీ ఆర్‌ఆర్‌ఆర్‌ ( RRR movie )హీరో అల్లూరి అలియాస్‌ రామ్‌ చరణ్‌ హీరోగా నటిస్తున్న గేమ్‌ ఛేంజర్‌ సినిమా విడుదల కాబోతుంది.

Telugu Rrr, Allu Arjun, Devara, Game Changer, Pushpa, Ram Charan, Tollywood-Movi

గేమ్ ఛేంజర్‌ సినిమా( Game Changer ) విడుదల వల్ల సంక్రాంతికి పుష్ప 2 సినిమాను విడుదల చేయడం సాధ్యం అయ్యే పరిస్థితి కనిపించడం లేదు.ఇక సమ్మర్‌ లో అయినా ఈ సినిమా ను విడుదల చేయాలి అనుకుంటే అదే ఆర్ఆర్ఆర్ స్టార్‌ కొమురం భీమ్‌ అలియాస్ ఎన్టీఆర్‌ నటిస్తున్న దేవర సినిమా( Devara Movie ) ఏప్రిల్‌ లో రాబోతుంది.దాంతో ఏప్రిల్ నెలలో సినిమా ను విడుదల చేయడం సాధ్యం కాదని తేలిపోయింది.

ఇలాంటి సమయంలో సినిమాను మే లో లేదా జూన్ లో అయినా సినిమాను విడుదల చేయాలని భావిస్తున్నట్లుగా సమాచారం అందుతోంది.మొత్తానికి రామ్‌ చరణ్‌, ఎన్టీఆర్ ల వల్ల పుష్ప 2 సినిమా రిలీజ్ ప్లాన్స్ ను మార్చినట్లుగా టాక్‌ వినిపిస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube