టాలీవుడ్ టాప్ హీరోయిన్, టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ గాఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి నటి సమంత ( Samantha ) ప్రస్తుతం సినిమాలకు ఏడాది పాటు విరామం ప్రకటించి పూర్తిగా తన ఆరోగ్యం పై దృష్టి పెట్టడానికి సిద్ధమయ్యారు.గత కొన్ని నెలల క్రితం సమంతా మయోసైటిస్ వ్యాధికి గురయ్యారు.
ఈ వ్యాధి కారణంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి ఈమె కాస్త కోలుకోవడంతో తిరిగి సినిమా షూటింగ్ పనులలో బిజీ అయ్యారు.అయితే తాను కమిట్ అయినటువంటి సినిమాలు అన్నింటిని పూర్తి చేసినటువంటి సమంత ఈ వ్యాధిని పూర్తిగా నయం చేసుకోవడం కోసం ఏడాది పాటు సినిమాలకు విరామం ప్రకటించారు.

ఈ విధంగా ఇండస్ట్రీకి దూరమైనటువంటి సమంతా త్వరలోనే అమెరికా( America ) వెళ్ళబోతున్నారు.అయితే అమెరికా వెళ్లేలోపు ఈమె పలు ప్రదేశాలకు వెళ్తూ ప్రకృతిని ఆస్వాదిస్తూ తన మనసును ప్రశాంతంగా ఉంచుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.ప్రస్తుతం బాలి వెకేషన్ లో ఉన్నటువంటి సమంత తనకు సంబంధించిన అన్ని విషయాలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటున్నారు.ఇక త్వరలోనే సమంత అమెరికా వెళ్ళిపోతున్న తరుణంలో ఈమె గురించి ఒక వార్త వైరల్ గా మారింది.
ఈ వ్యాధి ట్రీట్మెంట్ కోసం భారీగా ఖర్చవుతుందని తెలుస్తుంది.

ఈమె ట్రీట్మెంట్ చేయించుకోవడం కోసం ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతున్నటువంటి తన స్నేహితుడి వద్ద సమంత ఏకంగా 25 కోట్ల రూపాయలు అప్పు చేసి మరి ట్రీట్మెంట్ కోసం అమెరికా వెళుతున్నట్టు సమాచారం.ఈ విధంగా సమంత ట్రీట్మెంట్ కోసం ఏకంగా 25 కోట్లు అప్పు చేశారన్న వార్త వైరల్ గా మారడంతో ఇన్ని సంవత్సరాలు సినిమా ఇండస్ట్రీలో స్టార్ గా నటించిన సమంత వద్ద ట్రీట్మెంట్ కోసం సరిపడా డబ్బులు కూడా లేవా సమంత మరి ఇలాంటి దారుణ పరిస్థితిలలో ఉన్నారా అంటూ కామెంట్లు చేస్తున్నారు.అలాగే మరికొందరు అక్కినేని ఫ్యామిలీ( Akkineni Family ) తో కలిసి ఉంటే తనకు ఇలాంటి పరిస్థితి వచ్చి ఉండేదే కాదని కామెంట్ చేస్తున్నారు.
మరి సమంత గురించి వస్తున్నటువంటి ఈ వార్తలలో ఎంతవరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది.