ఆరు అంగుళాల స్థలం కోసం జవాను దారుణ హత్య..!

సమాజంలో డబ్బుకు ఇచ్చే విలువలో పది శాతం విలువ కూడా మనిషికి, మనిషి ప్రాణాలకు ఇవ్వడం లేదు.మానవ సంబంధాల కంటే డబ్బు పైనే మనిషికి వ్యామోహం పెరుగుతోంది.

 Brutally Killing A Jawan For Six Inches Of Space , Brutally Killing , Six Inches-TeluguStop.com

ఇలాంటి కోవలోనే కేవలం 6 అంగుళాల స్థలం కోసం ఇంటి పక్కన నివసించే జవానును అత్యంత దారుణంగా హత్య చేసిన ఘటన బీహార్ లోని ముజఫ్ఫర్ పూర్( Muzaffarpur in Bihar ) లో చోటుచేసుకుని స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.ఇందుకు సంబంధించిన వివరాలు ఏమిటో చూద్దాం.

వివరాల్లోకెళితే.బీహార్ లోని ముజఫ్ఫర్ పూర్ జిల్లా లోని కాంటీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉండే యాదూ ఛాప్రా గ్రామంలో దీపేంద్ర కుమార్ సింగ్( Dipendra Kumar Singh ) (53) అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు.

ఇతను బీహార్ స్పెషల్ ఆర్మ్డ్ పోలీస్( Special Armed Police ) (బీఎస్ఏపీ) లో హావల్డార్ గా పనిచేస్తున్నాడు.పాట్నాలో విధులు నిర్వహిస్తున్న దీపేంద్ర సెలవులు తన గ్రామానికి వచ్చాడు.

Telugu Brutally, Dipendrakumar, Latest Telugu, Sanjay Kumar, Inches-Latest News

అయితే ఆరు అంగుళాల భూమి విషయంలో పక్కింటి వారితో వివాదం చోటు చేసుకుంది.దీపేంద్ర ఈ వివాదంపై మూడు రోజులుగా పోలీసులకు ఫోన్ చేసి చెబుతున్నా కూడా పోలీసులు స్పందించలేదు.అయితే పక్కింటి వారు సమయం చూసుకొని దీపేంద్రపై దాడి చేసి హత్య చేశారు.ఈ ఘటన జరిగిన వెంటనే కుటుంబ సభ్యులతో పాటు గ్రామస్తులంతా రహదారిపై ధర్నాకు దిగారు.

హత్య చేసిన నిందితులను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.

Telugu Brutally, Dipendrakumar, Latest Telugu, Sanjay Kumar, Inches-Latest News

మృతుడు దీపేంద్ర బంధువు అయినా సంజయ్ కుమార్( Sanjay Kumar ) మాట్లాడుతూ దీపేంద్ర పక్కింటి వారైనా రాహుల్, రాకేష్, శివంలు ఆరు అంగుళాల భూమి విషయంలో కావాలని గొడవ పెట్టుకున్నారని తెలిపాడు.ఆ ఆరు అంగుళాల భూమి దీపేంద్ర దేనని, ఆ స్థలంలో పక్కింటి వారు ఏదో నిర్మాణం చేయాలని కావాలనే గొడవ పెట్టుకుని హత్య చేశారని తెలిపారు.సరైన సమయంలో స్పందించని పోలీసులు హత్య అనంతరం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారని గ్రామస్తులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube