ఆరు అంగుళాల స్థలం కోసం జవాను దారుణ హత్య..!

సమాజంలో డబ్బుకు ఇచ్చే విలువలో పది శాతం విలువ కూడా మనిషికి, మనిషి ప్రాణాలకు ఇవ్వడం లేదు.

మానవ సంబంధాల కంటే డబ్బు పైనే మనిషికి వ్యామోహం పెరుగుతోంది.ఇలాంటి కోవలోనే కేవలం 6 అంగుళాల స్థలం కోసం ఇంటి పక్కన నివసించే జవానును అత్యంత దారుణంగా హత్య చేసిన ఘటన బీహార్ లోని ముజఫ్ఫర్ పూర్( Muzaffarpur In Bihar ) లో చోటుచేసుకుని స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

ఇందుకు సంబంధించిన వివరాలు ఏమిటో చూద్దాం.వివరాల్లోకెళితే.

బీహార్ లోని ముజఫ్ఫర్ పూర్ జిల్లా లోని కాంటీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉండే యాదూ ఛాప్రా గ్రామంలో దీపేంద్ర కుమార్ సింగ్( Dipendra Kumar Singh ) (53) అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు.

ఇతను బీహార్ స్పెషల్ ఆర్మ్డ్ పోలీస్( Special Armed Police ) (బీఎస్ఏపీ) లో హావల్డార్ గా పనిచేస్తున్నాడు.

పాట్నాలో విధులు నిర్వహిస్తున్న దీపేంద్ర సెలవులు తన గ్రామానికి వచ్చాడు. """/" / అయితే ఆరు అంగుళాల భూమి విషయంలో పక్కింటి వారితో వివాదం చోటు చేసుకుంది.

దీపేంద్ర ఈ వివాదంపై మూడు రోజులుగా పోలీసులకు ఫోన్ చేసి చెబుతున్నా కూడా పోలీసులు స్పందించలేదు.

అయితే పక్కింటి వారు సమయం చూసుకొని దీపేంద్రపై దాడి చేసి హత్య చేశారు.

ఈ ఘటన జరిగిన వెంటనే కుటుంబ సభ్యులతో పాటు గ్రామస్తులంతా రహదారిపై ధర్నాకు దిగారు.

హత్య చేసిన నిందితులను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. """/" / మృతుడు దీపేంద్ర బంధువు అయినా సంజయ్ కుమార్( Sanjay Kumar ) మాట్లాడుతూ దీపేంద్ర పక్కింటి వారైనా రాహుల్, రాకేష్, శివంలు ఆరు అంగుళాల భూమి విషయంలో కావాలని గొడవ పెట్టుకున్నారని తెలిపాడు.

ఆ ఆరు అంగుళాల భూమి దీపేంద్ర దేనని, ఆ స్థలంలో పక్కింటి వారు ఏదో నిర్మాణం చేయాలని కావాలనే గొడవ పెట్టుకుని హత్య చేశారని తెలిపారు.

సరైన సమయంలో స్పందించని పోలీసులు హత్య అనంతరం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారని గ్రామస్తులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు.

మణిరత్నం చేసిన ఆ సూపర్ హిట్ సినిమాలో మంచి ఛాన్స్ ను మిస్ చేసుకున్న నందమూరి బ్రహ్మిని…