మణిపూర్ లో చోటు చేసుకున్న హింసాత్మక ఘటనల నేపథ్యంలో విపక్షాల కూటమి పర్యటనకు సిద్ధం అయింది.ఇందులో భాగంగా ఇవాళ విపక్ష ఎంపీలు ఢిల్లీ నుంచి మణిపూర్ కు బయలు దేరారు.
మణిపూర్ లో రెండు రోజుల పాటు పర్యటించనున్న 20 మంది సభ్యులతో కూడిన ప్రతిపక్ష బృందం హింసాత్మక ఘటనలకు గల కారణాలను తెలుసుకోనున్నారు.అక్కడ వాస్తవ పరిస్థితులను తెలుసుకుని పార్లమెంట్ సమావేశాల్లో చర్చిస్తామని విపక్ష సభ్యులు చెబుతున్నారు.
అయితే ఇప్పటికే మణిపూర్ అంశంపై చర్చించాలని డిమాండ్ చేస్తూ కేంద్రంపై ఉభయసభల్లో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే.