యూనివర్శిల్ స్టార్ కమల్ హాసన్( Kamal Haasan ) హీరోగా శంకర్ దర్శకత్వం లో వచ్చిన భారతీయుడు సినిమా ఎంతటి భారీ విజయాన్ని సొంతం చేసుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.హీరో గా కమల్ హాసన్ ఆ సినిమా తో పాన్ ఇండియా రేంజ్ లోనే కాకుండా విదేశాల్లో కూడా అభిమానులను సొంతం చేసుకున్నాడు.
అందుకే ఆ సినిమా కు సీక్వెల్ చేయాలని ఇన్నాళ్లుగా ప్రయత్నాలు… చర్చలు జరిగాయి.ఎట్టకేలకు సినిమా భారీ ఎత్తున సీక్వెల్ కు రెడీ అయింది.

ఇండియన్ 2 సినిమా పై ఉన్న అంచనాల నేపథ్యం లో దర్శకుడు శంకర్( Shankar ) భారీ ఎత్తున ఈ సినిమాను ప్లాన్ చేశాడు.కొన్ని కారణాల వల్ల సినిమా ఆలస్యం అయింది.శంకర్ గత చిత్రం లోని డైలాగ్ మాదిరిగా లేట్ గా వచ్చినా లేటెస్ట్ గా వస్తుంది అన్నట్లుగా ఇండియన్ 2 సినిమా కూడా వండర్ గా ఉండబోతుంది అన్నట్లుగానే ఫ్యాన్స్ తో పాటు యూనిట్ సభ్యులు మాట్లాడుకుంటున్నారు.ఇండియన్ 2 సినిమా ను వచ్చే ఏడాది లో విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి.

ఇక ఈ సినిమా లోని కొన్ని డైలాగ్స్ కారణంగా సినిమా ను కొన్ని రాష్ట్రాల్లో బ్యాన్ చేసే అవకాశాలు ఉన్నాయి అంటూ వార్తలు వస్తున్నాయి.పొలిటికల్ గా ఈ సినిమా లో ఉండే డైలాగ్స్ వల్ల కొన్ని రాష్ట్రాలకు చెందిన నాయకుల మనోభావాలు దెబ్బ తినే అవకాశం ఉంది.అవినీతి పై ఉండే ఈ సినిమా ముఖ్య నాయకులను ట ఆర్గెట్ చేసే అవకాశాలు ఉన్నాయి అన్నట్లుగా వార్తలు వస్తున్నాయి.అదే జరిగితే సినిమా గురించి విడుదల సమయంలో ఆకాశాన్ని తాకే విధంగా వివాదాస్పద కథనాలు వస్తాయి.
కనుక సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంటుందనే నమ్మకం వ్యక్తం అవుతోంది.ఇండియన్ 2( indian 2) సినిమా లో కమల్ ద్వి పాత్రాభినయం చేస్తున్నాడా లేదా అనేది క్లారిటీ రావాల్సి ఉంది.
శంకర్ గత చిత్రాల ఫలితాల నేపథ్యం లో ఈ సినిమా భారీ గా అంచనాలు ఉన్నాయి.