మందు బాబుని బూటుతో కొట్టిన యూపీ కాప్.. షాకింగ్ వీడియో వైరల్..

ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రం, హర్దోయ్ జిల్లాలో పనిచేస్తున్న పోలీసు కానిస్టేబుల్ దినేష్ అత్రి అధికారం ఉందనే అహంతో రెచ్చిపోయాడు.ఈ పోలీస్ ఆఫీసర్ అతిగా మద్యం సేవించి దారుణంగా ప్రవర్తిస్తున్న ఓ వ్యక్తితో గొడవ పడ్డాడు.

 Up Cop Hit Drug Addict With Shoe Shocking Video Viral , Police Constable, Brutal-TeluguStop.com

ఈ ఘటన మొత్తం కెమెరాకు చిక్కింది.ఆ వీడియోలో, దినేష్ అత్రి( Dinesh Atri ) తన షూతో మందు బాబుని ఏకంగా 61 సార్లు కొట్టాడు! కేసు నమోదు చేసి పోలీస్ స్టేషన్‌కి తరలించడానికి బదులుగా అతను తన బూటుతో మందు బాబును ఇష్టం వచ్చినట్లు కొడుతూ తన డ్యూటీని మరిచాడు.

దీనికి సంబంధించిన వీడియో ట్విట్టర్‌లో వైరల్ గా కూడా మారింది.

సాధారణంగా లా అండ్ ఆర్డర్ ప్రకారం అత్యంత అవసరమైతే తప్ప ప్రజలపై విచక్షణారహితంగా భౌతిక దాడికి దిగకూడదు.ముఖ్యంగా చెప్పుతో కొట్టడం, బూటుతో తన్నడం లాంటివి చేయకూడదు.ఎందుకంటే ఇది మానవుల గౌరవానికి భంగం కలిగించినట్లు అవుతుంది.

అందుకే చేయి చేసుకున్నా వారికి ఇచ్చిన లాఠీలతోనే కొట్టాలి.రూల్స్, చట్ట ప్రకారమే వారిపై చర్యలు తీసుకోవాలి.

అయితే రీసెంట్ కేసులో వైరల్ వీడియోను ఉన్నతాధికారులు చూసిన తర్వాత, దినేష్ అత్రిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.దీనిపై దర్యాప్తు చేసి అతడి తప్పు ఉందని గ్రహించి ఉద్యోగం నుంచి సస్పెండ్ కూడా చేశారు.

అలానే ఏం జరిగిందో పోలీసు అధికారులు పూర్తి స్థాయిలో ఆరా తీశారు.

వారి ఇన్వెస్టిగేషన్‌లో ఆ రోజు దినేష్ పోలీసు యూనిఫారం ధరించలేదు.సాధారణ బట్టలే వేసుకున్నాడు.ఏదో కొనడానికి సమీపంలోని మార్కెట్‌కి వెళ్లాడు.

అదే మార్కెట్‌లో మందు తాగిన ఒక వ్యక్తి మహిళలతో సహా ఇతరులతో అసభ్యంగా ప్రవర్తించడం దినేష్ చూశాడు.ఆ వ్యక్తి దుకాణదారుల నుంచి ఫ్రీగా కూల్ డ్రింక్స్ డిమాండ్ చేయడం కూడా గమనించాడు.

ఆ వ్యక్తి పబ్లిక్‌కి ఇబ్బంది కలిగించకుండా అడ్డుకునేందుకు దినేష్ ప్రయత్నించాడు.ఆ వ్యక్తి అతనితో కూడా దురుసుగా ప్రవర్తించాడు.

అంతే, ఆగ్రహించిన కానిస్టేబుల్ దినేష్ ఆ వ్యక్తిని షూతో చాలాసార్లు కొట్టాడు.వెస్ట్ అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్‌ దుర్గేష్ కుమార్ సింగ్( Durgesh Kumar Singh ) ఈ ఘటనపై మాట్లాడుతూ బెజా క్రాసింగ్ అనే ప్రదేశంలో వీడియో తీశారని, ఇది షహాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోకి వస్తుందని చెప్పారు.

బూట్‌తో కొట్టడం చాలా బాధాకరమని, ఈ సంఘటనను చాలా సీరియస్‌గా తీసుకున్నామని ఆయన పేర్కొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube