త్వరలో శ్రీలంకలోనూ చెలామణి కానున్న భారత రూపాయి... ఆ వివరాలు ఇవే..

శ్రీలంక ప్రభుత్వం( Sri Lanka Govt ) డాలర్లు, యూరోలు, యెన్లను ఉపయోగిస్తున్నట్లే, స్థానిక లావాదేవీలకు భారత రూపాయిని ఉపయోగించాలని ఆలోచిస్తోంది.శ్రీలంకలో ఇండియన్ రూపీ చెల్లుబాటు అవుతే, భారతీయ పర్యాటకులు, వ్యాపారవేత్తలు ఆ దేశానికి వెళ్ళినప్పుడు ప్రయోజనకరంగా ఉంటుంది.

 Soon The Indian Rupee Will Be Circulating In Sri Lanka Too... These Are The Deta-TeluguStop.com

ఎందుకంటే వారు తమ డబ్బును మరొక కరెన్సీలోకి మార్చవలసిన అవసరం లేకుండా మన దేశ రూపాయల్లో ట్రాన్సక్షన్లు చేసుకోవచ్చు.

Telugu Bilateral, Dollar, Euro, Indian Rupee, Sri Lanka, Trincomalee, Yen Touris

భారత రూపాయి చెలామణిలోకి తెచ్చేందుకు NIPL, లంక పే అనే రెండు సంస్థల మధ్య “నెట్‌వర్క్ టు నెట్‌వర్క్ అగ్రిమెంట్” అనే ఒప్పందంపై ఇండియా, శ్రీలంక ఆల్రెడీ సంతకం చేశాయి.ప్రజలు లావాదేవీల కోసం డిజిటల్ పేమెంట్ యాప్‌లను ఎలా ఉపయోగిస్తున్నారో, అలాగే UPI డిజిటల్ పేమెంట్ వ్యవస్థను ఉపయోగించడానికి ఈ ఒప్పందం శ్రీలంకను అనుమతిస్తుంది.భారత్, శ్రీలంక నేతలు మోదీ, విక్రమసింఘేలు( Narendra Modi ) పరస్పరం మాట్లాడుకున్న తర్వాత ఈ ఒప్పందం కుదిరింది.

వ్యాపారాలు, ప్రజల మధ్య వాణిజ్యం, లావాదేవీలను సులభతరం చేయడానికే ఈ యూపీఐ డిజిటల్ పేమెంట్ వ్యవస్థను ఉపయోగించడానికి రెండు దేశాలు కూడా అంగీకరించాయి.శ్రీలంకలోని ట్రింకోమలీని భారతదేశ సహాయంతో పరిశ్రమలకు, ఇంధనానికి కేంద్రంగా మార్చడం గురించి కూడా వారు మాట్లాడారు.

శ్రీలంక అన్ని దేశాలతో స్నేహపూర్వకంగా ఉండాలని కోరుకుంటున్నందున మరో దేశమైన చైనాకు దీనితో ఎటువంటి ఇబ్బందులు లేవు.

Telugu Bilateral, Dollar, Euro, Indian Rupee, Sri Lanka, Trincomalee, Yen Touris

భారతదేశం, శ్రీలంక( Sri Lanka ) నాయకులు తమ ఓడరేవుల మధ్య ప్రయాణాన్ని సులభతరం చేయడం గురించి కూడా చర్చించారు, తద్వారా వారు మరింత వాణిజ్యం చేసుకోవచ్చు.ఇది ఆర్థిక వ్యవస్థలు వృద్ధి చెందడానికి సహాయపడుతుంది.ఇది జరగడానికి వారు వంతెనను నిర్మించడం లేదా ఫెర్రీ సేవలను తీసుకురావడం గురించి ఆలోచిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube