టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) ప్రస్తుతం వారాహి యాత్రను( Varahi Yatra ) కొనసాగిస్తున్న విషయం తెలిసిందే.ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లోని పశ్చిమగోదావరి జిల్లాలో పర్యటిస్తున్నారు.
జూన్ 30న భీమవరంలో( Bhimavaram ) ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభకు పవర్ స్టార్ అభిమానులు జనసేన నేతలతో పాటు భారీగా ఎన్టీఆర్ అభిమానులు( Jr NTR ) తరలివచ్చారు.ఎన్టీఆర్ పవన్ కళ్యాణ్ కలిసి ఉన్న ఫ్లెక్సీలను పట్టుకొని బహిరంగ సభ వద్ద అభిమానాన్ని చాటుకున్నారు.
ఎన్టీఆర్ అయినప్పటికీ సమాజంలో మార్పు కోసం పవన్ కళ్యాణ్ కు మద్దతు తెలుపుతున్నాము అని చెబుతున్నారు.సమాజంలో మార్పు కోరుకుంటున్న వ్యక్తి పవన్ కళ్యాణ్ అని అటువంటి నాయకుడికి అందరూ మద్దతు తెలపాలని సినీ హీరో అభిమానం వేరు, రాజకీయాలు వేరని అంటున్నారు ఎన్టీఆర్ ఫ్యాన్స్.జూనియర్ ఎన్టీఆర్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాకపోయినా తమ మద్దతు మాత్రం పవన్ కళ్యాణ్ కే తెలుపుతామంటున్నారు.ప్రస్తుతం తారక్, పవన్ కలిసి ఉన్న ప్లెక్సీలకు సంబంధించిన ఫోటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇది ఇలా ఉంటే వార్త సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో మన వారాహి యాత్రలో భాగంగా పవన్ కళ్యాణ్ టాలీవుడ్ లో అందరు హీరోలను ఉద్దేశించే మాట్లాడిన మాటలతో అందరూ హీరోల మనసులను గెలుచుకున్నాడు.దీంతో ఎన్టీఆర్ అభిమానులతో పాటు టాలీవుడ్ చాలామంది హీరోల అభిమానులు పవన్ కళ్యాణ్ కు మద్దతు తెలుపుతున్నారు.ఎన్టీఆర్ అభిమానులతో పాటు అందరి హీరోల అభిమానులలో మార్పు రావడానికి కారణం మొన్న పవన్ కళ్యాణ్ ప్రసంగించిన ప్రసంగమే అని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు నెటిజన్స్.