Sunil Lahri : రాముడి పాత్రకు రణ్‌బీర్‌ కపూర్ సరైన ఎంపిక.. రామాయణం నటుడు కామెంట్స్ వైరల్?

గత కొద్ది రోజులుగా టాలీవుడ్ ఇండస్ట్రీ తో పాటు బాలీవుడ్( Bollywood ) లో ఎక్కువగా వినిపిస్తున్న పేరు రామాయణం.ఆది పురుష్ సినిమా తర్వాత ఈ సినిమా పేరు ఈ రెండు ఇండస్ట్రీలలో ఎక్కువగా మారుమోగిపోతోంది.

 Sunil Lahri Says Ranbir Is A Very Good Choice For The Role Of Ram-TeluguStop.com

  ఇది ఇలా ఉంటే ప్రముఖ సినీ నిర్మాత అల్లు అరవింద్‌ మరికొందరు బాలీవుడ్‌ ప్రొడ్యూసర్ లతో కలిసి ఎంతో ప్రతిష్ఠాత్మకంగా రామాయణాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే.దీనిలో నటించే తారాగణంపై కూడా రకరకాల వార్తలు వస్తున్నాయి.

నితేశ్‌ తివారీ( Nitesh Tiwari ) దర్శకత్వంలో రానున్న ఈ చిత్రం కోసం నటీనటులకు లుక్‌ టెస్ట్‌ చేశారనే వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి.

Telugu Bollywood, Ram Character, Ramayanam, Ranbir Kapoor, Sunil Lahri-Movie

అందుకు సంబంధించిన ఫొటోలు కూడా సోషల్‌ మీడియాలో వైరల్ గా మారాయి.కాగా ఇందులో రాముడిగా రణ్‌బీర్‌ కపూర్‌ను ఓకే చేసింది చిత్రబృందం.అలాగే సీత పాత్ర కోసం అలియా భట్‌కు లుక్‌ టెస్ట్‌ చేశారట.

తాజాగా వీరి ఎంపికపై రామాయణం నటుడు సునీల్‌ లహ్రీ ( Sunil Lahri )ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.వాళ్లిద్దరూ మంచి నటీనటులు.కచ్చితంగా కథకు న్యాయం చేస్తారు.రాముడిగా రణ్‌బీర్‌( Ranbir ) సరైన ఎంపిక.

అతడు కచ్చితంగా ఆ పాత్రకు సరిపోతాడు.ఇక అలియా కూడా చాలా టాలెంటెడ్‌ నటి.కానీ, గతంలో ఈ తరహా పాత్రలు చేసి ఉంటే సీత పాత్రకు మరింత న్యాయం చేయగలదని నా అభిప్రాయం.

Telugu Bollywood, Ram Character, Ramayanam, Ranbir Kapoor, Sunil Lahri-Movie

గత కొన్నేళ్లలో అలియాలో( Alia ) ఒక నటిగా చాలా మార్పులు వచ్చాయి.మరి సీతగా ఎలా అలరిస్తుందో చూడాలి అని తెలిపారు.ఇక ఈ సినిమాలో రావణుడిగా యశ్‌ నటిస్తున్నాడనే వార్తలు ఇటీవల అయిన విషయం తెలిసిందే.

అయితే తాజాగా దీనిపై యశ్‌ స్పందిస్తూ తాను బాలీవుడ్‌ సినిమాల్లో నటించడం లేదని స్పష్టం చేశారు.కాగా ఇదే ఇంటర్వ్యూలో సునీల్‌ లహ్రీ రామాయణం సీరియల్‌ రీ టెలికాస్ట్‌ గురించి మాట్లాడుతూ.

రామాయణం అందరి జీవితాల్లో భాగమైంది.మన ఇళ్లలో దాన్ని మననం చేసుకుంటూనే ఉన్నాము.

అది ఇప్పుడు బుల్లి తెరపై మరోసారి కనిపించనుంది అని తెలిపారు.రామానంద్‌ సాగర్‌ తెరకెక్కించిన రామాయణం కాగా రామాయణం సీరియల్‌ జులై 3 నుంచి రీ టెలికాస్ట్‌ కానున్న విషయం తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube