వన్డే క్రికెట్లో ప్రపంచ రికార్డు సృష్టించిన సికిందర్ రజా..!

వన్డే వరల్డ్ కప్ క్వాలిఫయర్ మ్యాచ్లలో( ODI World Cup Qualifier ) కొన్ని జట్లు చెలరేగి ప్రత్యర్థి జట్లను చిత్తుగా ఓడిస్తున్నాయి.వన్డే వరల్డ్ కప్ టోర్నీలో పాల్గొనేందుకు 8 జట్లు నేరుగా అర్హత సాధించాయి.

 Sikandar Raza Smashes Fastest Ever Odi Century For Zimbabwe In 54 Balls Details,-TeluguStop.com

మిగిలిన రెండు స్థానాల కోసం పది జట్ల మధ్య ఉత్కంఠ పోరు సాగుతోంది.

తాజాగా నెదర్లాండ్స్- జింబాబ్వే మధ్య జరిగిన మ్యాచ్లో జింబాబ్వే ఘనవిజయం సాధించింది.నెదర్లాండ్ ( Netherlands ) నిర్దేశించిన పరుగుల లక్ష్యాన్ని జింబాబ్వే ( Zimbabwe ) 40.5 ఓవర్లలో టార్గెట్ చేదించి, ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది.

జింబాబ్వే ప్లేయర్ సికందర్ రజా( Sikandar Raza ) ఈ మ్యాచ్ తో ప్రపంచ రికార్డ్ సృష్టించాడు.గత ఏడాది జరిగిన టీ20 ప్రపంచ కప్ లో సికిందర్ రజా సృష్టించిన విధ్వంసం ఎప్పటికీ మరిచిపోలేనిది.

ప్రస్తుతం ఈ మ్యాచ్ లో కూడా అదే ఫామ్ ను కొనసాగించి స్టార్ క్రికెటర్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు.

Telugu Balls Century, Odi Century, Netherlands, Sikandar Raza, Sikandarraza, Zim

తాజాగా జరిగిన మ్యాచ్లో 54 బంతుల్లోనే సికిందర్ రజా సెంచరీ చేశాడు.వన్డే క్రికెట్లో ఇది ఓ అరుదైన రికార్డుగా గుర్తుండి పోతుంది.వన్డే క్రికెట్ చరిత్రలో అత్యంత వేగంగా సెంచరీ చేసిన తొలి వ్యక్తిగా సికందర్ రజా నిలిచాడు.

నెదర్లాండ్ బౌలర్లకు చుక్కలు చూపించి 8 సిక్సులు, 6 ఫోర్లతో సెంచరీ చేసి నాట్ అవుట్ గా నిలిచాడు.

Telugu Balls Century, Odi Century, Netherlands, Sikandar Raza, Sikandarraza, Zim

ఈ రికార్డ్ సీన్ విలియమ్స్ పేరిట ఉండేది.సీన్ విలియమ్స్ 70 బంతుల్లో సెంచరీ చేశాడు.అయితే సికిందర్ రాజా ఆ రికార్డును బద్దలు కొట్టి సరికొత్త చరిత్ర సృష్టించాడు.

అంతేకాకుండా ఈ మ్యాచ్లో ఆల్ రౌండర్ గా అద్భుత ఆటను ప్రదర్శించి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును సికిందర్ రజా అందుకున్నాడు.తర్వాతి మ్యాచ్లలో కూడా సికిందర్ రజా ఇదే ఫామ్ కొనిగిస్తే ఖచ్చితంగా వన్డే వరల్డ్ కప్ టోర్నీలో చోటు దక్కే అవకాశం ఉంటుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube