బీజేపీపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు.పల్నాడు జిల్లాలోని పెదకూరపాడు నియోజకవర్గంలో పర్యటించిన ఆయన జగనన్న విద్యాకానుక పథకాన్ని ప్రారంభించారు.
అనంతరం బహిరంగ సభలో సీఎం జగన్ మాట్లాడుతూ బీజేపీ అగ్రనేతలు అమిత్ షా, జేపీ నడ్డా వ్యాఖ్యలపై పరోక్షంగా స్పందించారు.జగనన్నకు బీజేపీ అండగా ఉండకపోవచ్చన్నారు.
అయినా ఫర్వాలేదన్న ఆయన జగన్ ప్రజలనే నమ్ముకున్నాడని స్పష్టం చేశారు.ఇది కురుక్షేత్ర సంగ్రామ యుద్ధమని, ఈ యుద్దంలో ప్రజలే తన బలమని వెల్లడించారు.
అయితే తాజాగా ఏపీలో పర్యటించిన బీజేపీ జాతీయ నేతలు మొదటిసారిగా వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు చేసిన సంగతి తెలిసిందే.