బెండను( lady finger ) ఆశించే బూడిద తెగులు ఒక శిలీంద్రం.ఈ తెగులు పొడి వాతావరణం లో కూడా వ్యాపిస్తాయి.
గాలి, నీరు, ఇతర క్రిముల వల్ల ఈ తెగులు మొక్కలను ఆశించి ఆకుల మొగ్గలు మరియు మొక్కల అవశేషాలలో ఈ సిలింద్ర బీజాంశాలు జీవించి ఉంటాయి.ఉదయం సమయాలలో పొగ మంచు ఉంటే ఈ బూడిద తెగులు వ్యాప్తి చెందే అవకాశం ఎక్కువ.
బెండ యొక్క ఆకులు, కాండం, కాయలపై( leaves, stems, pods ) తెల్లని మచ్చలు ఏర్పడతాయి.తరువాత చెట్ల ఆకుల ఎదుగుదల మందగించడంతోపాటు ఆకులు ముడతలు పడి రాలిపోతాయి.
ఈ తెగులు కిరణజన్య సంయోగ క్రియను అడ్డుకొని ఆకు పసుపు రంగులోకి మారిపోయేటట్లు చేస్తాయి.
మార్కెట్లో దొరికే తెగులు నిరోధకగా ను తట్టుకునే విత్తనాలను ఎంపిక చేసుకోవాలి.పొలంలో మొక్కల మధ్య దూరం ఉండేటట్లు నాటుకోవాలి.పొలంలో ఎక్కడైనా తెల్లని మచ్చలు ( White spots )కనిపిస్తే వెంటనే ఆ మొక్కలను పంట నుండి వేరు చేసి కాల్చి నాశనం చేయాలి.
పంట కోత తరువాత భూమిని లోతుగా దున్నుకోవాలి.ముఖ్యంగా పంట అవశేషాలను పంట నుండి పూర్తిగా వేరు చేయాలి.
పొలంలో ఎప్పటికప్పుడు కలుపులు నివారించాలి.ఈ తెగులను గుర్తించి ముందుగా సేంద్రీయ పద్ధతిలో గంధకం, వేప నూనె, అస్కార్బిక్ యాసిడ్( Sulphur, neem oil, ascorbic acid ) లాంటి వాటిని పిచికారీ చేయాలి.ఎక్కువగా సేంద్రియ ఎరువులకే ప్రాధాన్యత ఇవ్వాలి.ఈ తెగుల వ్యాప్తి అధికంగా ఉన్నట్లయితే రసాయన పిచికారి మందులైన ఎక్స కొనజోల్ 5.0EC ను ఒక లీటర్ నీటిలో కలిపి పంటకు పిచికారి చేయాలి.లేదంటే సల్ఫర్ 80.0wp ను ఒక లీటరు నీటిలో కలిపి పంటను పిచికారి చేసి ఈ బూడిద తెగులను వెంటనే అరికట్టాలి.ఈ తెగులను అరికట్టడంలో విఫలం అయితే సగానికి పైగా దిగుబడి తగ్గే అవకాశం ఉంది.