సీనియర్ ఎన్టీఆర్ సంస్కారం అంత గొప్పదా.. ఇందిరా గాంధీ చనిపోతే అలా చేశారా?

సీనియర్ ఎన్టీఆర్( Sr NTR ) గొప్పదనం గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుందనే సంగతి తెలిసిందే.ఆయన మరణించి చాలా సంవత్సరాలు అవుతున్నా ప్రజల హృదయాల్లో మాత్రం ఆయన జీవించే ఉన్నారు.

 Ex Ips Narasaiah About Senior Ntr Greatness Details, Ex Ips Narasaiah ,senior Nt-TeluguStop.com

సీనియర్ ఎన్టీఆర్ గొప్పదనం గురించి మాజీ ఐపీఎస్ ఆఫీసర్ నరసయ్య( Ex IPS Narasaiah ) గురించి మాట్లాడుతూ ఆయన షాకింగ్ కామెంట్లు చేశారు.ఎన్టీఆర్ హార్ట్ ఆపరేషన్ కోసం అమెరికాకు వెళ్లారని ఆయనతో పాటు నేను కూడా వెళ్లాలని కానీ వెళ్లలేదని నరసయ్య చెప్పుకొచ్చారు.

ఆ సమయంలో ఎమ్మెల్యేలలో గూడుపుఠాని మొదలైందని ఆయన విదేశాల నుంచి తిరిగొచ్చిన సమయంలో ఆయనను చూస్తే బాధేసిందని నరసయ్య అన్నారు.సీనియర్ ఎన్టీఆర్ ను రిసీవ్ చేసుకోవడానికి భాస్కరరావు గారు కూడా వచ్చారని ఆయన తెలిపారు.

ఆ తర్వాత భాస్కరరావును మంత్రివర్గం నుంచి తొలగిస్తూ ఎన్టీఆర్ లేఖ రాశారని నరసయ్య అన్నారు.ఆ సమయంలో నాదెండ్ల ( Nadendla Bhaskar Rao ) దగ్గర 25 మంది ఎమ్మెల్యేలు కూడా లేరని ఆయన తెలిపారు.

Telugu Chandrababu, Greatness, Indira Gandhi, Nadendlabhaskar, Nandamuritaraka,

చంద్రబాబు లేకపోతే ఆరోజే పార్టీ పోయేదని నరసయ్య కామెంట్లు చేశారు.మెజారిటీ ప్రూవ్ చేసుకుని ఎన్టీఆర్ మళ్లీ అధికారంలోకి రావడం జరిగిందని నరసయ్య అన్నారు.ఆ తర్వాత మళ్లీ ఆయనతో కలిసి నేను పని చేశానని నరసయ్య తెలిపారు.ఆ సమయంలో ఇందిరా గాంధీ( Indira Gandhi ) చనిపోయారని ఆయన కామెంట్లు చేశారు.

ఇందిరా గాంధీ చనిపోయిన సమయంలో సీనియర్ ఎన్టీఆర్ ఢిల్లీకి వెళ్లి నివాళి అర్పించారని నరసయ్య అన్నారు.

Telugu Chandrababu, Greatness, Indira Gandhi, Nadendlabhaskar, Nandamuritaraka,

ఇందిరా గాంధీ నాదెండ్ల భాస్కరరావు ద్వారా ద్రోహం చేసినా సీనియర్ ఎన్టీఆర్ సంస్కారాన్ని ప్రదర్శించారని ఆయన సంస్కారం అంత గొప్పదని నరసయ్య కామెంట్లు చేశారు.నరసయ్య వెల్లడించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఆ జనరేషన్ ప్రేక్షకులతో పాటు ఈ జనరేషన్ ప్రేక్షకులు సైతం సీనియర్ ఎన్టీఆర్ ను ఎంతగానో అభిమానిస్తారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube