సీనియర్ ఎన్టీఆర్ సంస్కారం అంత గొప్పదా.. ఇందిరా గాంధీ చనిపోతే అలా చేశారా?

సీనియర్ ఎన్టీఆర్( Sr NTR ) గొప్పదనం గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుందనే సంగతి తెలిసిందే.

ఆయన మరణించి చాలా సంవత్సరాలు అవుతున్నా ప్రజల హృదయాల్లో మాత్రం ఆయన జీవించే ఉన్నారు.

సీనియర్ ఎన్టీఆర్ గొప్పదనం గురించి మాజీ ఐపీఎస్ ఆఫీసర్ నరసయ్య( Ex IPS Narasaiah ) గురించి మాట్లాడుతూ ఆయన షాకింగ్ కామెంట్లు చేశారు.

ఎన్టీఆర్ హార్ట్ ఆపరేషన్ కోసం అమెరికాకు వెళ్లారని ఆయనతో పాటు నేను కూడా వెళ్లాలని కానీ వెళ్లలేదని నరసయ్య చెప్పుకొచ్చారు.

ఆ సమయంలో ఎమ్మెల్యేలలో గూడుపుఠాని మొదలైందని ఆయన విదేశాల నుంచి తిరిగొచ్చిన సమయంలో ఆయనను చూస్తే బాధేసిందని నరసయ్య అన్నారు.

సీనియర్ ఎన్టీఆర్ ను రిసీవ్ చేసుకోవడానికి భాస్కరరావు గారు కూడా వచ్చారని ఆయన తెలిపారు.

ఆ తర్వాత భాస్కరరావును మంత్రివర్గం నుంచి తొలగిస్తూ ఎన్టీఆర్ లేఖ రాశారని నరసయ్య అన్నారు.

ఆ సమయంలో నాదెండ్ల ( Nadendla Bhaskar Rao ) దగ్గర 25 మంది ఎమ్మెల్యేలు కూడా లేరని ఆయన తెలిపారు.

"""/" / చంద్రబాబు లేకపోతే ఆరోజే పార్టీ పోయేదని నరసయ్య కామెంట్లు చేశారు.

మెజారిటీ ప్రూవ్ చేసుకుని ఎన్టీఆర్ మళ్లీ అధికారంలోకి రావడం జరిగిందని నరసయ్య అన్నారు.

ఆ తర్వాత మళ్లీ ఆయనతో కలిసి నేను పని చేశానని నరసయ్య తెలిపారు.

ఆ సమయంలో ఇందిరా గాంధీ( Indira Gandhi ) చనిపోయారని ఆయన కామెంట్లు చేశారు.

ఇందిరా గాంధీ చనిపోయిన సమయంలో సీనియర్ ఎన్టీఆర్ ఢిల్లీకి వెళ్లి నివాళి అర్పించారని నరసయ్య అన్నారు.

"""/" / ఇందిరా గాంధీ నాదెండ్ల భాస్కరరావు ద్వారా ద్రోహం చేసినా సీనియర్ ఎన్టీఆర్ సంస్కారాన్ని ప్రదర్శించారని ఆయన సంస్కారం అంత గొప్పదని నరసయ్య కామెంట్లు చేశారు.

నరసయ్య వెల్లడించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఆ జనరేషన్ ప్రేక్షకులతో పాటు ఈ జనరేషన్ ప్రేక్షకులు సైతం సీనియర్ ఎన్టీఆర్ ను ఎంతగానో అభిమానిస్తారు.

కంటి చూపును పెంచే కొత్తిమీర.. ఎలా తీసుకుంటే మంచిది?