జగన్ వ్యతిరేక ప్రచారంతో హోరెత్తిస్తున్న ప్రతిపక్షాలు

వచ్చే ఎన్నికలలో( election ) ఎట్టి పరిస్థితులలోను అధికార పార్టీని గద్దె దించాలని భావిస్తున్న ఆంధ్రప్రదేశ్( Andhra Pradesh ) ప్రతిపక్షాలు ఆ దిశగా ప్రచారాన్ని ముమ్మరం చేసాయి పొటా పోటీగా ప్రచారాలు మొదలు పెడుతూ రాజకీయాల్లో వేగాన్ని పెంచేస్తున్నాయి.ఒకపక్క తెలుగుదేశం జాతీయ కార్యదర్శి లోకేష్ రాయలసీమ జిల్లాలలో యువగళం( Yuvagalam ) పర్యటనను కొనసాగిస్తూ అధికార పార్టీపై మాటల తూటాలు పేలుస్తూ అదికార పార్టీ నేతల విదనాలను విమర్శిస్తున్నారు ,మరోవైపు జనసేన( Janasena ) అధినేత పవన్ కళ్యాణ్ తన వారాహి ప్రచార రదాన్ని లైన్ లో పెట్టేసారు.

 Ap Oppostion Is Creating Anti Jagan Situvation Details, Ap Election,andhra Prade-TeluguStop.com

ఉభయ గోదావరి జిల్లాలు టార్గెట్గా సుదీర్ఘ సుదీర్ఘ యాత్రకు ప్లాన్ చేసిన జనసేన వర్గాలు అధికార పార్టీ తీరును అన్ని రకాలుగా ఎండ కట్టాలని బలమైన సంకల్పం తో ముందుకు వెళ్తున్నారు.మౌలిక సదుపాయాల కల్పనలో, కానీ పారిశ్రామిక విధానంలో కానీ ప్రభుత్వం ఫెయిల్ అయిన విషయాన్ని ప్రజల్లో ఎండగట్టాలని తద్వారా జగన్ ప్రభుత్వం వ్యతిరేకతను పెంచే విధంగా ఈ యాత్ర సాగబోతున్నట్లుగా తెలుస్తుంది.

Telugu Andhra Pradesh, Jagan, Ap, Chandrababu, Janasena, Lokesh, Pawan Kalyan, Y

మరోపక్క తెలుగుదేశం అధినేత చంద్రబాబు( Chandrababu ) కూడా ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాలపై పూర్తిస్థాయిలో ఫోకస్ పెట్టారు.అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఎటువైపు చూసిన జగన్ వ్యతిరేక నినాదాలతో మోత మొగిపోతుంది .ప్రభుత్వం విఫలమైన ప్రతి అంశాన్ని దృష్టిలో పెట్టుకొని దాన్ని ప్రజల్లో హైలెట్ చేయాలని తద్వారా ఆయా వర్గాలను ప్రభుత్వానికి దూరం చేయాలనే ఆలోచనతో ప్రతిపక్షాలు ఉన్నట్లుగా తెలుస్తుంది.ప్రజల దృష్టిలో జగన్ పరిపాలనపై అసంతృప్తి పెల్లుబికెలా తమ ప్రచార వేగాన్ని పెంచాలని, ఎన్నికల షెడ్యూల్ ప్రకటించి ప్రచారపర్వం పూర్తయ్యే వరకు కూడా పూర్తిస్థాయిలో ప్రజల్లోనే ఉండాలని ఎట్టి పరిస్థితుల్లోనూ జనాలు మూడ్ మారకుండా ఈ వేగాన్ని కంటిన్యూ చేయాలనే ఆలోచనలో ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్షాలు ఉన్నట్లుగా తెలుస్తుంది.

మరి ప్రతిపక్షాల విమర్శలు హోరును అధికార పార్టీ ఏ మేరకు తట్టుకొని నిలబడుతుందో, వారి ఎత్తులకు ఎలా పై ఎత్తులు వేస్తుందో అన్న ఆసక్తి సర్వత్రా వ్యక్తం అవుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube