తిరుపతిలో 'ఆదిపురుష్' సందడి.. ప్రీ రిలీజ్ ఈవెంట్ కు గ్రాండ్ ఏర్పాట్లు!

ఇతిహాస గ్రంధం రామాయణం ఆధారంగా తెరకెక్కిన పాన్ ఇండియన్ మూవీ ‘ఆదిపురుష్’( ‘Adipurush’ ).బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్( Om Raut ) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ పీరియాడిక్ వండర్ లో ప్రభాస్ రాముడి పాత్రలో నటిస్తుంటే కృతి సనన్ సీత పాత్రలో నటిస్తున్న విషయం విదితమే.

 Prabhas' Adipurush Grand Pre-release Event In Tirupati , Adipurush, Adipurush P-TeluguStop.com

అలాగే సైఫ్ అలీ ఖాన్ రావణాసురిడిగా నటిస్తుండగా.సన్నీ సింగ్ లక్షణుడిగా నటిస్తున్నాడు.

తెలుగు, హిందీ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కిన ఈ సినిమాను టి సిరీస్ సంస్థ, రిట్రో ఫైల్స్ 500 కోట్ల భారీ బడ్జెట్ తో సంయుక్తంగా నిర్మించారు.మరో 10 రోజుల్లో గ్రాండ్ గా రిలీజ్ కానున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను మేకర్స్ జూన్ 6న ఫిక్స్ చేసారు.

ఈ ఈవెంట్ కోసం ఎప్పటి నుండో తిరుపతి నగరాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నారు.

తిరుపతి( Tirupati ) వేదికగా రేపు ఈ ఈవెంట్ గ్రాండ్ గా జరగనున్న నేపథ్యంలో తిరుపతిలో సందడి నెలకొంది.ఈ నగరానికి ఇప్పుడు సినీ ప్రముఖులు భారీ స్థాయిలో క్యూ కడుతున్నారు.అందులోను ప్రభాస్ సినిమా కావడంతో ఫ్యాన్స్ భారీగా తిరుపతి తరలి వస్తారని పోలీసులు భారీ బందోబస్తు చేస్తున్నారు.

సుమారు 1000 మంది పోలీసులతో ఈ ఈవెంట్ కోసం వచ్చే ఫ్యాన్స్ కు ఎటువంటి ఆటంకం కలగకుండా చర్యలు చేపడుతున్నట్టు చెబుతున్నారు.

ఇక ట్రాఫిక్ పోలీసులు కూడా ఎక్కడికక్కడ ట్రాఫిక్ ఆంక్షలను విధిస్తు ట్రాఫిన్ ను మళ్లించే ప్రయత్నాలు చేస్తున్నారట.ఇక తాజాగా ఈ వేడుక కోసం చినజీయర్ స్వామి అతిథిగా పాల్గొనబోతున్నట్టు మేకర్స్ కొద్దిసేపటి క్రితం ప్రకటించారు.దీంతో రేపు ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎంత గ్రాండ్ గా జరుగుతుందో అని ఫ్యాన్స్, ప్రముఖులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube