తిరుపతిలో ‘ఆదిపురుష్’ సందడి.. ప్రీ రిలీజ్ ఈవెంట్ కు గ్రాండ్ ఏర్పాట్లు!
TeluguStop.com
ఇతిహాస గ్రంధం రామాయణం ఆధారంగా తెరకెక్కిన పాన్ ఇండియన్ మూవీ 'ఆదిపురుష్'( 'Adipurush' ).
బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్( Om Raut ) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ పీరియాడిక్ వండర్ లో ప్రభాస్ రాముడి పాత్రలో నటిస్తుంటే కృతి సనన్ సీత పాత్రలో నటిస్తున్న విషయం విదితమే.
అలాగే సైఫ్ అలీ ఖాన్ రావణాసురిడిగా నటిస్తుండగా.సన్నీ సింగ్ లక్షణుడిగా నటిస్తున్నాడు.
తెలుగు, హిందీ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కిన ఈ సినిమాను టి సిరీస్ సంస్థ, రిట్రో ఫైల్స్ 500 కోట్ల భారీ బడ్జెట్ తో సంయుక్తంగా నిర్మించారు.
మరో 10 రోజుల్లో గ్రాండ్ గా రిలీజ్ కానున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను మేకర్స్ జూన్ 6న ఫిక్స్ చేసారు.
ఈ ఈవెంట్ కోసం ఎప్పటి నుండో తిరుపతి నగరాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నారు.
"""/" /
తిరుపతి( Tirupati ) వేదికగా రేపు ఈ ఈవెంట్ గ్రాండ్ గా జరగనున్న నేపథ్యంలో తిరుపతిలో సందడి నెలకొంది.
ఈ నగరానికి ఇప్పుడు సినీ ప్రముఖులు భారీ స్థాయిలో క్యూ కడుతున్నారు.అందులోను ప్రభాస్ సినిమా కావడంతో ఫ్యాన్స్ భారీగా తిరుపతి తరలి వస్తారని పోలీసులు భారీ బందోబస్తు చేస్తున్నారు.
సుమారు 1000 మంది పోలీసులతో ఈ ఈవెంట్ కోసం వచ్చే ఫ్యాన్స్ కు ఎటువంటి ఆటంకం కలగకుండా చర్యలు చేపడుతున్నట్టు చెబుతున్నారు.
"""/" /
ఇక ట్రాఫిక్ పోలీసులు కూడా ఎక్కడికక్కడ ట్రాఫిక్ ఆంక్షలను విధిస్తు ట్రాఫిన్ ను మళ్లించే ప్రయత్నాలు చేస్తున్నారట.
ఇక తాజాగా ఈ వేడుక కోసం చినజీయర్ స్వామి అతిథిగా పాల్గొనబోతున్నట్టు మేకర్స్ కొద్దిసేపటి క్రితం ప్రకటించారు.
దీంతో రేపు ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎంత గ్రాండ్ గా జరుగుతుందో అని ఫ్యాన్స్, ప్రముఖులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
ఓజీ మూవీలో ఇంటర్వెల్ సీన్ నెక్స్ట్ లెవల్ లో ఉండబోతుందా..?