దాదాపుగా 20 సంవత్సరాల క్రితం బాలయ్య సమరసింహారెడ్డి, నరసింహ నాయుడు సినిమాలతో కొన్నేళ్ల గ్యాప్ లోనే ఇండస్ట్రీ హిట్లను అందుకున్నారు.అయితే నరసింహ నాయుడు( Narasimha Naiud ) సక్సెస్ తర్వాత బాలయ్యకు లక్ కలిసిరాలేదు.వరుసగా సినిమాల్లో నటించినా లక్ష్మీ నరసింహ మినహా మరే సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోలేదు.2001 నుంచి 2010 సంవత్సరంలో సింహా విడుదలయ్యే వరకు బాలయ్యకు( Balakrishna ) భారీ షాకులు తగిలాయి.
వీరభద్ర, అల్లరి పిడుగు, మహారథి, ఒక్క మగాడు, మిత్రుడు, విజయేంద్ర వర్మ సినిమాలు బాలయ్య అభిమానులకు సైతం అస్సలు నచ్చలేదు.ఈ సినిమాలు నిర్మాతలకు సైతం భారీ స్థాయిలో నష్టాలను మిగిల్చాయి.
సింహా సినిమాతో( Simha ) బాలయ్య సక్సెస్ సాధించినా సింహా తర్వాత మళ్లీ వరుస షాకులు తగిలాయి.విచిత్రం ఏంటంటే బాలయ్యకు ఫ్లాపులిచ్చిన డైరెక్టర్లలో ఎక్కువమంది పెద్దగా క్రేజ్ లేని డైరెక్టర్లు కావడం గమనార్హం.
ఈ డైరెక్టర్లలో కొంతమంది ఇతర భాషల డైరెక్టర్లు, మరి కొందరు కొత్త డైరెక్టర్లు ఉన్నారు.అయితే బాలయ్య ఎక్కడ ఓడాడో అక్కడే గెలిచాడు.కొన్నేళ్ల క్రితం వరకు బాలయ్యతో సినిమా అంటే స్టార్ డైరెక్టర్లు దూరంగా ఉండేవారు.బోయపాటి శ్రీను మినహా మిగతా స్టార్ డైరెక్టర్లు బాలయ్యతో సినిమాకు ప్రాధాన్యత ఇచ్చేవారు కాదు.
అయితే గత కొన్నేళ్లలో పరిస్థితి మారిపోయింది.స్టార్ డైరెక్టర్లు బాలయ్యతో కలిసి పని చేయడానికి తెగ ఆసక్తి చూపిస్తున్నారు.
బాలయ్యతో సినిమా చేసిన డైరెక్టర్లు మళ్లీమళ్లీ ఆయనతో కలిసి పని చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు.బాలయ్య మార్కెట్ కు మించి ఖర్చు చేయడానికి నిర్మిస్తున్నారు.బాలయ్య ప్రాజెక్ట్ లు ఈ మధ్య కాలంలో వరుసగా సక్సెస్ అవుతున్నాయి.ఎక్కడ ఓడాడో బాలయ్య అక్కడే గెలిచి తనేంటో ప్రూవ్ చేసుకున్నాడని నెటిజన్ల నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి.
బాలయ్యకు రాబోయే రోజుల్లో మరిన్ని భారీ విజయాలు దక్కాలని అభిమానులు భావిస్తున్నారు.