ప్లే ఆఫ్ రేసులో జట్లు ఏ స్థానాలలో ఉన్నాయంటే..?

ఈ ఐపీఎల్ సీజన్-16 ఉత్కంఠ భరితంగా మొదలై చివరి దశకు చేరుకుంది.ఇప్పటికే అన్ని జట్లకు 11 మ్యాచులు పూర్తయ్యాయి.

 Where Are The Teams In The Play Off Race, Play Off , Ipl, Sports , Sports News-TeluguStop.com

కేవలం ప్రతి జట్టు మరో మూడు మ్యాచ్లు మాత్రమే ఆడాల్సి ఉంది.దీంతో ప్లే ఆఫ్ చేరేందుకు జట్లు పోటీ పడుతున్నాయి.ప్రస్తుతం ప్లే ఆఫ్ రేసులో జట్లు ఏ స్థానాల్లో ఉన్నాయో చూద్దాం.

గుజరాత్:

ఈ జట్టు( Gujarat Titans ) 8 మ్యాచ్ లలో గెలిచి 16 పాయింట్లతో లీగ్ టేబుల్ లో అగ్రస్థానంలో కొనసాగుతూ దాదాపుగా ప్లే ఆఫ్ బెర్త్ ఖరారు చేసుకుంది.ఈ జట్టు ఇంకా మూడు మ్యాచులు ఆడాల్సి ఉంది.ఈ మూడు మ్యాచ్లలో ఓడిన కూడా ప్లే ఆఫ్ కు చేరే అవకాశం 92శాతం ఉంది.

చెన్నై:

ఈ జట్టు 12 మ్యాచ్లలో ఆడి ఏడు మ్యాచ్లలో గెలిచింది.ఒక మ్యాచ్ మధ్యలో ఆగిపోవడంతో 15 పాయింట్లతో రెండో స్థానంలో ఉండి ప్లే ఆఫ్ బెర్త్ ను కాయం చేసుకుంది.

ఈ జట్టు ఇంకా రెండు మ్యాచ్లు ఆడాల్సి ఉంది.ఈ రెండు మ్యాచ్లలో ఓడితే మిగతా ఫలితాలపై ఆధార పడవలసి ఉంటుంది.ఈ జట్టుకు ప్లే ఆఫ్ చేరే అవకాశం 70 శాతం ఉంది.

Telugu Chennai, Gujarat Titans, Ipl, Latest Telugu, Mumbai Indians-Sports News

ముంబై:

ఈ జట్టు 12 పాయింట్లతో మూడవ స్థానంలో ఉంది.ఈ జట్టు ఇంకా మూడు మ్యాచ్లు ఆడాల్సి ఉంది.ఒక మ్యాచ్లో ఓడిపోయిన మిగిలిన రెండు మ్యాచ్లలో భారీ విజయాలు సాధించాలి.

ముంబై జట్టుకు( Mumbai Indians ) ప్లే ఆఫ్ కు చేరే అవకాశం 61 శాతం ఉంది.

Telugu Chennai, Gujarat Titans, Ipl, Latest Telugu, Mumbai Indians-Sports News

బెంగుళూరు:

ఈ జట్టు పది పాయింట్లతో ఏడవ స్థానంలో ఉంది.ప్లే ఆఫ్ చేరాలంటే మిగిలి ఉన్న మూడు మ్యాచ్లలో కచ్చితంగా గెలవాల్సిందే.ఒక మ్యాచ్ లో ఓడిన కూడా ప్లే ఆఫ్ కు చేరే అవకాశాలు ఉండవు.

Telugu Chennai, Gujarat Titans, Ipl, Latest Telugu, Mumbai Indians-Sports News

హైదరాబాద్:

ఈ సీజన్లో డేంజరస్ జట్టుగా హైదరాబాద్( sunrisers hyderabad ) నిలిచింది.ఈ జట్టు ప్లే ఆఫ్ కు చేరాలంటే మిగిలిన నాలుగు మ్యాచులు తప్పకుండా గెలవాల్సిందే.లక్నో, బెంగుళూరు, ముంబై, గుజరాత్ జట్లను ఓడించాల్సి ఉంది.ఒకవేళ హైదరాబాద్ జట్టు ప్లే ఆఫ్ కు చేరితే, ఇతర జట్ల ప్లే ఆఫ్ భవితవ్వం ఈ జట్టు పై ఆధారపడి ఉంది.

ఇక మిగిలిన జట్ల విషయానికి వస్తే లక్నో 11 పాయింట్లతో నాలుగో స్థానంలో, 10 పాయింట్లతో రాజస్థాన్, కోల్ కత్తా, పంజాబ్ 5,6,8 స్థానాలలో కొనసాగుతున్నాయి.ఈ జట్లు ఒక్క మ్యాచ్ ఓడిన ప్లే ఆఫ్ కు చేరలేవు.

ఢిల్లీ జట్టు 11 మ్యాచ్లలో నాలుగు మాత్రమే విజయం సాధించి చివరి స్థానంలో నిలిచింది.ఏదైనా అద్భుతం జరిగితేనే ఈ జట్టు ప్లే ఆఫ్ కు చేరుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube