Rajinikanth Sumalatha : నీళ్ల కోసం కొట్టుకుంటున్న రెండు రాష్ట్రాల హీరోలు ..!

అస్సలు హీరోలు అంటే ఎలా ఉంటారు.లక్సరీ లైఫ్ లీడ్ చేస్తూ, రిచ్ బట్టలతో ఎండా వేడి ఎలా ఉంటుందో కూడా తెలియకుండా ఉంటారు.

 Rajinikanth Sumalatha : నీళ్ల కోసం కొట్టుకు-TeluguStop.com

సినిమా ప్రమోషన్స్ కోసం బయటకు రావడం తప్ప పబ్లిక్ లో ఎక్కడ కనిపించరు.కానీ ఇప్పడు పరిస్థితి మరొక కనిపిస్తుంది.

తమను నమ్మి సినిమా చూస్తున్న ప్రేక్షకులకు కష్టం వస్తే తాము ఉన్నామంటూ చెప్పడానికి హీరోలు తమ పని కాకపోయినా కొన్ని సార్లు ఉద్యమాల్లో కూడా దిగాల్సి వస్తుంది.రైతుల కష్టాలు మావి అంటూ రాజకీయా నాయకుల మాదిరిగా డైలాగ్స్ చెప్తూ ముందు ఉండి మరి పోరాటాలు చేస్త్తున్నారు.

అయితే ఇలా ప్రజా పోరాటాలు చేస్తున్నది మన తెలుగు హీరోలు అనుకుంటే పొరపాటే.

Telugu Ambareesh, Kamal Haasan, Kollywood, Sanlewood, Sumalatha, Upendra, Upperb

కావేరి నది జలాల పంపిణి విషయంలో అటు కర్ణాటక ఇటు తమిళనాడు( Tamil Nadu ) మధ్య గొడవ జరుగుతున్న నేపథ్యంలో ఎవరి రాష్ట్రానికి చెందిన రైతులకు వారి హీరో లు మద్దతు పలికి వారు కూడా రైతుల వెనకాలే ఉన్నామని తెలియచేసే ప్రయత్నం చేస్తున్నారు.అయితే ఈ పోరాటం ఇప్పుడు కొత్తగా జరుగుతున్నది ఏమి కాదు.చాల ఏళ్లుగా నీటి పంపిణి విషయంలో రెండు రాష్ట్రాలకు బేధాభిప్రాయాలు ఉన్నాయ్.

కానీ ఇప్పుడు ఒక అడుగు ముందుకు వేసి మరోమారు రెండు రాష్ట్రాల హీరోలు రచ్చకు ఎక్కుతున్నారు.తమిళనాడు రాష్ట్రం నుంచి రజినీకాంత్, కమల్ హాసన్ ( Rajinikanth )ముందు వరసలో ఉండగా, కన్నడ రాష్ట్రం నుంచి అంబరీష్ స్థానంలో అయన భార్య సుమలత, ఉపేంద్ర( Upendra ), శివరాజ్ కుమార్ కుటుంబం నుంచి వచ్చిన హీరోలు ఉన్నారు.

Telugu Ambareesh, Kamal Haasan, Kollywood, Sanlewood, Sumalatha, Upendra, Upperb

వారి వారి ప్రాంతాల కోసం నీళ్లు కావలి అంటూ గట్టిగా అడుగుతున్నారు.అయితే కర్ణాటక రాష్ట్రంలో కడుతున్న ఎగువబద్ర ప్రాజెక్ట్ కారణంగా నీరు మొత్తంగా అడుగు అంటి పోతుంది.ఇక అక్కడ నుంచి నీరు తుంగభద్రకు వచ్చే అవకాశాలు లేవు.పైగా ఆ రాష్ట్ర ఎన్నికల సమయంలో కేంద్ర జాతీయ హోదా కూడా కట్టబెట్టింది.ఇకపై రాయలసీమ ఒక ఎడారి ప్రాంతంగా మారడం ఖాయం.కర్ణాటక రాష్ట్రం బచావత్‌ ట్రైబ్యునల్ తీర్పును తుంగలో తొక్కి తుంగభద్రకు రావాల్సిన నీళ్లను ఎక్కువగా వాడుతున్నారు.

ఇందుకు కేంద్రం మద్దతు ఉన్నాక ఎవరు మాత్రం ఏం చేయగలరు.మరి ఎగబద్ర నీళ్ల కోసం మన తెలుగు హీరోలు కూడా పోరాటం చేస్తే ఏమైనా ఫలితం ఉండేదేమో .!

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube