నాగచైతన్య ( Nagachaitanya ) వెంకట్ ప్రభు ( Venkat Prabhu )దర్శకత్వంలో నటించిన కస్టడీ సినిమా( Custody Movie ) ద్వారా ఈ నెల 12వ తేదీ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యారు.తెలుగు తమిళ భాషలలో తెరికెక్కిన ఈ సినిమాలో నాగచైతన్య పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారు.
ఇక ఈ సినిమాలో నాగచైతన్యకు జోడిగా కృతి శెట్టి( Kriti Shetty ) నటించిన విషయం మనకు తెలిసిందే.ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో భారీగా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.
ఈ ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా వరుస ఇంటర్వ్యూలకు హాజరవుతున్న నాగచైతన్య తన సినీ కెరియర్ గురించి మాత్రమే కాకుండా వ్యక్తిగత జీవితం గురించి కూడా ఎన్నో విషయాలు తెలియజేస్తున్నారు.
ఇప్పటికే తాను ప్రేమించి పెళ్లి చేసుకున్నటువంటి సమంత గురించి తనకు ఎందుకు విడాకులు ఇవ్వాల్సి వచ్చిందనే విషయం గురించి నాగచైతన్య తెలియజేసిన విషయం మనకు తెలిసిందే.ఇలా తనకు విడాకులు ఇవ్వడానికి రూమర్స్ కారణమని తెలిపారు.ఈ విధంగా నాగచైతన్య ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా తన వ్యక్తిగత జీవితం గురించి కూడా ఎన్నో విషయాలు తెలియజేశారు.
అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ఈయనకు యాంకర్ నుంచి ఒక ప్రశ్న ఎదురయింది.ఇప్పటివరకు మీరు నటించినటువంటి సినిమాలలో మీ కో యాక్టర్స్ లో మీకు నచ్చిన క్వాలిటీ ఏంటి అని ప్రశ్నించారు.
ఈ ప్రశ్నకు నాగచైతన్య సమాధానం చెబుతూ పూజ హెగ్డే( Pooja Hedge ) లో తనకు తన స్టైల్ అంటే చాలా ఇష్టమని ఆ క్వాలిటీ తనకు నచ్చిందని తెలిపారు.ఇక కృతి శెట్టి( Kriti Shetty ) చాలా ఇన్నోసెంట్ అని తెలియజేశారు.ఇక సమంత( Samantha ) గురించి మాట్లాడుతూ తన హార్డ్ వర్క్ అంటే తనకు ఇష్టమని ఈ క్వాలిటీ తనకు చాలా నచ్చుతుందని నాగచైతన్య తెలిపారు.సమంత తాను కమిట్ అయిన సినిమాల కోసం ఎంత కష్టపడతారో మనకు తెలిసిందే.
ఈ క్రమంలోనే నాగచైతన్యకు సైతం సమంత హార్డ్ వర్క్ అంటే తనకు చాలా ఇష్టమని ఈ సందర్భంగా చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.