‘RC16’ టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ రాబోతుందా.. ఎప్పుడంటే?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) ఆర్ఆర్ఆర్ (RRR) సినిమా తర్వాత భారీగా స్టార్ డమ్ పెంచుకున్న విషయం తెలిసిందే.ఈ సినిమా తర్వాత ఈయన గ్లోబల్ స్టార్ గా వెలుగొందు తున్నాడు.

 Ram Charan Rc16 Movie Latest Update-TeluguStop.com

ఇక ఈ సినిమా తర్వాత భారీ లైనప్ సెట్ చేసుకుంటూ మరింత వేగంగా ముందుకు వెళుతున్నాడు.ప్రస్తుతం రామ్ చరణ్ అగ్ర డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘గేమ్ చేంజర్’ (Game Changer) సినిమాలో నటిస్తున్నాడు.

ఈ సినిమా ఇప్పటికే షూట్ చివరి స్థాయికి చేరుకుంది.దీంతో ఈ సినిమా తర్వాత సినిమాపై గత కొన్ని రోజులుగా ఏదొక వార్త వైరల్ అవుతూనే ఉంది.తాజాగా ఈ సినిమా నుండి మరొక వార్త వైరల్ అయ్యింది.RC16 అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాను బుచ్చిబాబు సానా (Buchi Babu Sana) డైరెక్ట్ చేయనున్నాడు.ఉప్పెన సినిమాతో భారీ స్టార్ డమ్ తెచ్చుకున్న ఈ డైరెక్టర్ ఆ తర్వాత గ్లోబల్ స్టార్ తో సినిమా ప్రకటించడం ఆసక్తిగా మారింది.

ఈ సినిమాకు సంబంధించిన లేటెస్ట్ బజ్ ఒకటి నెట్టింట వైరల్ అవుతుంది.ఈ సినిమా టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ త్వరలో మేకర్స్ విడుదల చేయనున్నట్టు రూమర్ ఒకటి నెట్టింట హల్ చల్ చేస్తుంది.ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన సైతం త్వరలో వెలువడే అవకాశం ఉందని టాక్.

ఇక ఈ సినిమా విషయంలో చరణ్ కూడా ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్నాడు.

ఈ సినిమా కోసం చరణ్ స్పెషల్ యాస కూడా నేర్చుకోనున్నాడు అనే టాక్ వచ్చింది.ఇక RC16 సినిమాను యూవీ క్రియేషన్స్ వారు గ్రాండ్ గా నిర్మిస్తుండగా.ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నాడు.

మరి ఈ ఇంట్రెస్టింగ్ కాంబో ఎలా ఉండబోతుందో వేచి చూడాల్సిందే.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube