జాబ్ మానేసి ఫుల్‌టైమ్‌ మంత్రగత్తెగా మారిన మహిళ.. నెలకి 7 లక్షల సంపాదన..

మంత్రాలకు చింతకాయలు రాలుతాయో లేదో కానీ మంత్రగాళ్లుమంత్రగత్తెలుగా( Spiritual awakening ) చెప్పుకునే వారికి మాత్రం డబ్బులు లక్షలలో రాలుతాయి.ఈ విషయం మనదేశంలోనే కాదు ఇతర దేశాల్లో కూడా చాలాసార్లు నిరూపితం అయింది.

 Jessica Caldwell Beautician Left Job And Now Rakes In £7k A Month As A Full Ti-TeluguStop.com

తాజాగా మంత్రగత్తెగా మారితే ఎంత ఎక్కువ డబ్బులు సంపాదించవచ్చో ఒక మహిళ నిరూపిస్తోంది.వినడానికి ఇది విడ్డూరంగా అనిపించినా మూఢనమ్మకాలను ఇప్పటికీ నమ్మేవారు ఉన్నారు కాబట్టి వారి ఆటలు సాగుతున్నాయి.

వివరాల్లోకి వెళ్తే.జెస్సికా కాల్డ్‌వెల్ (29)( Jessica Caldwell ) ఒక మాజీ బ్యూటీషియన్.ఆమె 2019లో ఫేస్‌బుక్ గ్రూప్ ద్వారా మంత్రవిద్యపై తనకున్న ఆసక్తిని గుర్తించింది.తర్వాత ఫుల్ టైమ్ మంత్రగత్తె కావడానికి తన ఉద్యోగాన్ని విడిచిపెట్టింది.ఆమె టారో కార్డ్‌లను చదవడం, స్ఫటికాలతో పని చేయడం నేర్చుకుంది.ఇప్పుడు సెలబ్రిటీలతో సహా 5,000 మంది క్లయింట్‌లను కలిగి ఉండటం విశేషం.

ఆమె నెలకు రూ.7 లక్షలు సంపాదిస్తుంది.ఇన్‌స్టాగ్రామ్( Instagram ) ద్వారా మాత్రమే పనిచేస్తుంది.ఆమె కుటుంబం మొదట్లో ఆందోళన చెందింది, కానీ ఇప్పుడు ఆమె బాగా డబ్బు సంపాదించడంతో వారు ఆమెకు మద్దతు ఇచ్చారు.

జెస్సికా కఠినమైన ప్రేమ సలహాలతో సహా వ్యక్తుల కోసం రీడింగ్‌లను అందిస్తుంది.స్పెల్ వర్క్, ఆధ్యాత్మికతపై ఉచిత సలహాలను అందిస్తుంది.రక్షణ ఆకర్షణలను ఎలా సృష్టించాలో.ఇతరులను ఎలా ఆకర్షించాలో ప్రజలకు బోధిస్తుంది.ఈమె గురించి తెలిసిన నెటిజన్లు ఇది కూడా ఒక ప్రొఫెషన్ అంటూ తమ ఆశ్చర్యాన్ని వ్యక్తపరుస్తున్నారు.మంత్ర విద్యతో ఇన్ని డబ్బులు సంపాదించవచ్చని తమకు ఇప్పుడే తెలిసిందంటూ మరికొందరు కామెంట్లు పెడుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube