సూపర్ స్టార్ రజనీ కాంత్ (Rajinikanth) గురించి ఇండియన్ వైడ్ గా ప్రేక్షకులకు పరిచయం చేయాల్సిన పని లేదు.ఈయన కోలీవుడ్ స్టార్ అయినప్పటికీ ఇండియన్ వైడ్ గా గుర్తింపు తెచ్చుకుని ఫ్యాన్స్ చేత సూపర్ స్టార్ గా మన్ననలు పొందుతున్నాడు.70 ఏళ్ళు దాటినా కూడా ఇప్పటికి ఈయన వరుస సినిమాలు చేస్తూ ఆడియెన్స్ ను అలరిస్తున్నాడు.
అయితే హిట్స్ కంటే ఎక్కువ ప్లాప్స్ మాత్రమే పలకరిస్తున్నాయి.కానీ ప్రస్తుతం చేస్తున్న సినిమా మీద మాత్రం భారీ అంచనాలు నెలకొన్నాయి.ప్రెజెంట్ రజనీకాంత్ చేస్తున్న సినిమా ”జైలర్”( Jailer Movie ).ఈ మధ్య కాలంలో రజనీకాంత్ సినిమాల్లో ఇంత హైప్ ఏర్పరుచుకున్న సినిమా ఇదే కావడం విశేషం.కోలీవుడ్ డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ ( Nelson Dilipkumar ) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపు కుంటుంది.
ఇక ఈ సినిమాలో రజినీకాంత్ సరసన తమన్నా హీరోయిన్ గా నటిస్తుండగా.సన్ పిక్చర్స్ వారు భారీ స్థాయిలో నిర్మిస్తున్న ఈ సినిమా ఆగస్టులో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధం అవుతుంది.ఇదిలా ఉండగా ఈయన నెక్స్ట్ సినిమా గురించి తాజాగా ఒక వార్త వైరల్ అవుతుంది.కోలీవుడ్ నుండి అందుతున్న సమాచారం ప్రకారం రజినీకాంత్ తన నెక్స్ట్ సినిమాను లోకేష్ కనకరాజ్ ( Lokesh Kanagaraj ) దర్శకత్వంలో చేస్తున్నట్టు టాక్.
వీరి కాంబోపై గత కొన్నాళ్లుగా రూమర్స్ వినిపిస్తూనే ఉన్నాయి.కానీ తాజాగా ఈ కాంబో ఫిక్స్ అయ్యిందని.అలానే ఈ సినిమాను కూడా సన్ పిక్చర్స్ సంస్థ భారీగా నిర్మించనుందని సమాచారం.ఇక లోకేష్ ప్రస్తుతం విజయ్ దళపతి ( Thalapathy Vijay ) తో ‘లియో‘ ( Leo ) సినిమా చేస్తున్నాడు.
ఈ సినిమా పూర్తి అవ్వగానే రజినీకాంత్ తో సినిమా చేయనున్నట్టు తెలుస్తుంది.దీనిపై అధికారిక ప్రకటన వస్తే కానీ అసలు విషయం బయటకు రాదు.