కోనరావుపేట మండల కేంద్రంలో మున్నూరు కాపు కుల బాంధవులు పోచమ్మ, మైసమ్మ తల్లికి బోనాలు!

ఈ కార్యక్రమానికి డాక్టర్ గోలి మోహన్ ని మున్నూరు కాపు కుల బాంధవులు ప్రేమతో ఆహ్వానించారు.రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండల కేంద్రంలో మున్నూరు కాపు కుల బాంధవులు పోచమ్మ మైసమ్మ తల్లికి ఘనంగా బోనాలు తీయడం జరిగింది.

 Pochamma And Maisamma, The Relatives Of Munnuru Kapu Clan In Konaraopeta Mandal-TeluguStop.com

ఈ సందర్భంగా మున్నూరు కాపు సంఘ సభ్యులు మాట్లాడుతూ ఈరోజు ఈ బోనాల పండుగకి డాక్టర్ గోలి మోహన్ రావడం చాలా సంతోషకరమని మున్నూరు కాపు కులంలో చాలామంది యువత చదువు పూర్తి చేసి ఊర్లోనే ఉంటున్నారని ఇలాంటి వారి కోసం మీరు ఉపాధి మార్గం చూపాలని, మీకు ఎల్లవేళలా అండగా ఉంటామని రాబోయే రోజుల్లో మీరు చేసే ప్రతి కార్యక్రమంలో భాగస్వామ్యులవతామని అన్నారు.డాక్టర్ గోలి మోహన్ మాట్లాడుతూ నన్ను ఇక్కడికి ఆహ్వానించినటువంటి మున్నూరు కాపు కుల బాంధవులకు నా ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

కాపు అనగానే కడుపులో పెట్టుకొని అందరికీ అన్నం పెట్టేవాడని అలాంటి వాళ్ళు ఈ గ్రామానికి రాష్ట్రానికి దేశానికి వెన్నుముకలాంటివారని రాబోయే రోజుల్లో ఈ గ్రామంలోని యువతకు, మహిళలకు, రైతులకు ప్రత్యేక ప్రణాళికతో మీ ముందుకు వస్తున్నానని ఈ వేములవాడ నియోజకవర్గ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నానని మీరందరూ నాకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.పోచమ్మ తల్లి మన అందరిని చల్లగా చూడాలని ప్రకృతి వైరుధ్యాలు జరగకుండా కాపాడాలని కోరారు.

ఈ కార్యక్రమంలో మున్నూరు కాపు కుల బాంధవులు గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్, ప్రజలు పాల్గొన్నారు

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube