కన్న తండ్రి సొంతింటి కలను నెరవేర్చానన్న ప్రియాంక సింగ్.. గ్రేట్ అంటూ?

బిగ్ బాస్ షో( Bigg Boss ) ద్వారా ప్రేక్షకుల్లో మంచి పాపులారిటీని సొంతం చేసుకున్న వాళ్లలో ప్రియాంక సింగ్( Priyanka Singh ) ఒకరు.తెలుగు రాష్ట్రాల సినీ ప్రేక్షకులలో ప్రియాంక సింగ్ కు క్రేజ్, పాపులారిటీ పెరుగుతుందే తప్ప తగ్గడం లేదు.

 Priyanka Singh Comments About New House Details, Priyanka Singh, Priyanka Singh-TeluguStop.com

తాజాగా ప్రియాంక సింగ్ కన్న తండ్రి సొంతింటి కలను నెరవేర్చడం ద్వారా వార్తల్లో నిలిచారు.జబర్దస్త్ షో ద్వారా పాపులర్ అయిన సాయితేజ్ ( Saitej ) ఆ తర్వాత రోజుల్లో ప్రియాంక సింగ్ గా మారిపోయారు.

బిగ్ బాస్ షోలో పాల్గొన్న సమయంలో పలు సందర్భాల్లో సొంతింటి గురించి ప్రస్తావించిన ప్రియాంక సింగ్ ఆముదాలవలసలో సొంతిల్లు కట్టించుకోవడం ద్వారా వార్తల్లో నిలిచారు.ప్రియాంక సింగ్ తాజాగా సోషల్ మీడియాలో ఇంటికి సంబంధించిన వీడియోను షేర్ చేయగా ఆ వీడియో తెగ వైరల్ అవుతోంది.

ఇట్స్ మీ ప్రియాంక అనే యూట్యూబ్ ఛానల్ లో ప్రియాంక సింగ్ ఈ వీడియోను పంచుకున్నారు.

ఈ వీడియోకు ఇప్పటివరకు 2,67,000కు పైగా వ్యూస్ వచ్చాయి.నేను కష్టపడి సంపాదించిన డబ్బుతో ఈ ఇల్లు కట్టించానని ఆమె తెలిపారు.కొంతకాలం క్రితమే గృహ ప్రవేశం జరిగిందని వీడియోను ఆలస్యంగా పోస్ట్ చేశానని ప్రియాంక సింగ్ పేర్కొన్నారు.

పొలాల మధ్య పచ్చదనం ఉన్న ప్లేస్ లో ప్రియాంక సింగ్ ఇల్లు కట్టించారు.టీవీ షోస్ చేసే సమయంలో ల్యాండ్ కొనుక్కొని ఇప్పుడు కట్టించానని ఆమె అన్నారు.

మా నాన్నగారు కన్న కలను నేను ఐతే నెరవేర్చానని ప్రియాంక సింగ్ వెల్లడించారు.మా కుటుంబానికి నచ్చిన విధంగా ఈ ఇంటిని కట్టుకోవడం జరిగిందని ఆమె పేర్కొన్నారు.సొంతింటి కలను నెరవేర్చుకున్నందుకు ప్రియాంక సింగ్ కు నెటిజన్లు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.ప్రియాంక సింగ్ గ్రేట్ అని నెటిజన్లు సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube