కేంద్రం వ్యవసాయ ఉద్ధరణకు కంకణం కట్టుకుంది.ఈ క్రమంలోనే ఇందులోకి ఏఐ టెక్నాలజీని ఆహ్వానించింది.
మోడీ హయాంలో వ్యవసాయ రంగం రోజురోజుకు కొత్తపుంతలు తొక్కుతుంది అని చెప్పుకోవాలి.ప్రస్తుతం అందుబాటులోకి వస్తున్న నూతన టెక్నాలజీతో రైతులకు ఊరట కలగనుంది.
ఇకనుండి ఏఐ ఆధారిత చాట్‌బాట్ భారతీయ వ్యవసాయ సమాజానికి సేవలు అందించనుంది.భారతదేశం ఒక వ్యవసాయ పవర్‌హౌస్ అనే సంగతి అందరికీ విదితమే.
దేశంలోని అధిక జనాభా వ్యవసాయ రంగంలో పని చేస్తుందనే విషయం అందరికీ తెలిసినదే.
రైతుల జీవితాలను సులభతరం చేసే విధంగా ఈ కొత్త ఏఐ సాధనం ఉపయోగపడుతుంది.కంప్యూటర్ శాస్త్రవేత్త అయిన ప్రతీక్ దేశాయ్ చేత కిసాన్ జిపిటి ( Kissan GPT )అనే కొత్త చాట్‌బాట్ అభివృద్ధి చేయబడింది.ఇప్పటి వరకు రైతులకు సాగులో సందేహాలుంటే గూగుల్ ద్వారా క్లియర్ చేసుకునేవారు.
అయితే అది అందరికీ సాధ్యపడేది కాదు.కానీ, ఇపుడు కొత్తగా వచ్చిన కిసాన్ జిపిటి ద్వారా సందేహాలను సులభంగా తెలుసుకోవచ్చు, అదేవిధంగా ఎలాంటి విషయాన్నైనా అర్ధం చేసుకోవచ్చు.
ఇది ఒక చాట్ బోట్.దీనికోసం మీ ఫోన్లో బ్రౌజర్ ఓపెన్ చేసి కిసాన్ జిపిటి అని సెర్చ్ చేసి తర్వాత మీకు కావాల్సిన భాష ఎంచుకోవాలి.మీ ముందు కనిపిస్తున్న ఏ ఐ కోసం అనే ఆప్షన్పై క్లిక్ చేసి మీ సందేహాన్ని అక్కడ తెలపండి.దాంతో మీకు కావల్సిన సమాధానాన్ని వాయిస్ తో పాటు, రాత పూర్వకంగా మీరు తెలుసుకోగలుగుతారు.
చీడలు, ఎరువులు, నీటి యాజమాన్యం, వాతావరణ మార్పులు( Climate change ), కాలానుగుణంగా పంటలు వంటి అన్ని విషయాలు ఇందులో చాలా తేలికగా తెలుసుకోవచ్చు.ఇది రైతులకు( Farmers ) మాత్రమే కాకుండా విద్యార్థులు, ఉద్యోగులకు కూడా ఉపయోగపడుతుంది.ప్రభుత్వ భాగస్వామ్యంతో రైతులకు సాయంగా కిసాన్ GPT నిలవనుంది.