టాలీవుడ్ హీరోయిన్లలో చాలామంది హీరోయిన్లు బోల్డ్ రోల్స్ లో నటించడానికి ఒకింత సంకోచిస్తారనే సంగతి తెలిసిందే.అయితే బాలీవుడ్ హీరోయిన్లలో కొందరు హీరోయిన్లు మాత్రం బోల్డ్ రోల్స్ లో నటించడానికి అస్సలు సంకోచించరు.
ఈ జాబితాలో హీరోయిన్ ప్రియాంక చోప్రా( Priyanka Chopra ) ముందువరసలో ఉంటారనే సంగతి తెలిసిందే.సిటాడెల్ వెబ్ సిరీస్ లో ప్రియాంక చోప్రా బోల్డ్ గా టాప్ లెస్ గా కనిపించనున్నారు.
ఈ వెబ్ సిరీస్ ప్రమోషన్స్ లో భాగంగా శృంగార సన్నివేశాల్లో నటించడం గురించి ఎదురైన ప్రశ్నలకు ఆమె సిగ్గుపడ్డారు.రిచర్డ్ మ్యాడెన్( Richard Madden ) తో స్క్రిప్ట్ టైమ్ నుంచి క్లోజ్ గా మెలిగానని యాక్షన్ సీన్ల కొరకు ఒకరితో కలిసి మరొకరం పని చేశామని ఆ సమయంలో ఇద్దరి మధ్య మంచి అనుబంధం ఏర్పడిందన్ ప్రియాంక చోప్రా వెల్లడించారు.శృంగార సన్నివేశాల్లో మేమిద్దరం ప్రొఫెషనల్స్ గా వ్యవహరించామని ఆమె తెలిపారు.
సిటాడెల్ వెబ్ సిరీస్ లో లిప్ లాక్ సన్నివేశాల గురించి ప్రశ్న ఎదురు కాగా సిటాడెల్ వెబ్ సిరీస్ చూసి లిప్ లాక్ సీన్లు ఉన్నాయో లేదో తెలుసుకోవాలని రిచర్డ్ అన్నారు.ఓటీటీలకు సెన్సార్ లేకపోవడంతో ప్రముఖ ఓటీటీ సంస్థలు శృతి మించిన సీన్లతో సినిమాలను తెరకెక్కిస్తుండటం హాట్ టాపిక్ అవుతోంది.సిటాడెల్ కు భారీస్థాయిలో క్రేజ్ ఉండగా ఈ వెబ్ సిరీస్ ప్రేక్షకులను ఏ రేంజ్ లో ఆకట్టుకుంటుందో చూడాలి.
సిటాడెల్ సక్సెస్ సాధిస్తే మరిన్ని వెబ్ సిరీస్ ల నిర్మాణం దిశగా అమెజాన్ ప్రైమ్ అడుగులు వేయనుంది.సిటాడెల్ ఇండియన్ వెర్షన్ లో సమంత, వరుణ్ ధావన్( Samantha ) నటిస్తున్నారు.సిటాడెల్ కు పాజిటివ్ రెస్పాన్స్ రావాలని అభిమానులు కోరుకుంటున్నారు.ప్రియాంక చోప్రా కెరీర్ కు సంబంధించి ఆచితూచి అడుగులు వేస్తున్న సంగతి తెలిసిందే.