అమెరికా కంపెనీలను సైతం వెనక్కి నెట్టేసిన భారత్.. ఎందులో అంటే

భారతీయ కంపెనీలు( Indian companies ) ఓ విషయంలో అమెరికాను సైతం వెనక్కి నెట్టేశాయి.ఆఫీసుల కోసం స్థలాలను లీజుకు తీసుకునే విషయంలో అమెరికన్ కంపెనీల కంటే భారత్ కంపెనీలు ముందంజలో ఉన్నాయి.ఈ విషయం సీబీఆర్‌ఈ ఇండియా( CBRE India ) నివేదికలో తేలింది.”దేశీయ సంస్థలు వార్షిక ఆఫీసు లీజింగ్‌లో అమెరికన్ సంస్థలను అధిగమించాయి.2022లో లీజింగ్ వాటాలో దాదాపు సగం వాటాను కలిగి ఉన్నాయి.ప్రధానంగా ఫ్లెక్సిబుల్ స్పేస్ ఆపరేటర్లు, టెక్నాలజీ కార్పొరేట్‌లు, బీఎఫ్ఎస్ఐ సంస్థలు ఇందులో ప్రధాన భాగంగా ఉన్నాయి” అని సీబీఆర్ఈ తెలిపింది.

 India Pushed Back Even The American Companies Why , India ,pushed,back Even, Ame-TeluguStop.com

భారతదేశంలోని కార్యాలయాల కోసం 2022లో 56.6 మిలియన్ చదరపు అడుగులను లీజుకు సంస్థలు తీసుకున్నాయి.2021లో 49.7 మిలియన్ చదరపు అడుగులు ఉంది.అయితే 2019లో ఈ గణాంకాలు గరిష్ట స్థాయికి చేరుకున్నాయి.ఆ ఏడాది 65 మిలియన్ చదరపు అడుగులు కంపెనీలు లీజుకు తీసుకున్నాయి.ఆఫీసుల కోసం వార్షిక లీజింగ్ కార్యకలాపాల్లో బెంగళూరు, ఢిల్లీ-ఎన్‌సీఆర్, హైదరాబాద్, ముంబై నగరాలు దాదాపు 75% వాటాను కలిగి ఉన్నాయి.ఆఫీస్ స్పేస్ లీజింగ్ విషయంలో 2022లో కార్యకలాపాలు 40 శాతం పెరిగాయి.తొమ్మిది ప్రధాన నగరాల్లో 56.6 మిలియన్ చదరపు అడుగులకు చేరింది.గతంలో ఇది 40.5గా ఉండేది.ఇక దేశీయ సంస్థలు ఇలా లీజుకు ఎక్కువగా తీసుకునే నగరాలలో బెంగళూరు, ఢిల్లీ-ఎన్‌సిఆర్, ముంబై ముందంజలో ఉన్నాయి.అక్టోబరు-డిసెంబర్ త్రైమాసికంలో ఇదే విధమైన ధోరణి కనిపించింది.దేశీయ సంస్థలు స్పేస్ టేక్-అప్‌లో 51% వాటాను కలిగి ఉన్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube