జబర్దస్త్ కమెడియన్ పంచ్ ప్రసాద్( Panch Prasad ) గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.తనకు మాత్రమే సొంతమైన కామెడీ టైమింగ్ తో ఆకట్టుకున్న ప్రసాద్ గత కొంతకాలంగా కిడ్నీ( Kidney ), ఇతర ఆరోగ్య సమస్యలతో బాధ పడుతున్నారు.
పంచ్ ప్రసాద్ ఆరోగ్య సమస్యల నుంచి ఎన్నో వార్తలు ప్రచారంలోకి వచ్చాయనే సంగతి తెలిసిందే.అయితే పంచ్ ప్రసాద్ తన యూట్యూబ్ ఛానల్ ద్వారా ఆరోగ్య స్థితికి సంబంధించి ఎప్పటికప్పుడు కొత్త విషయాలను వెల్లడిస్తున్నారు.
తాజా వీడియోలో పంచ్ ప్రసాద్ భార్య మాట్లాడుతూ పంచ్ ప్రసాద్ డయాలసిస్ చికిత్స తీసుకున్నారని చెప్పుకొచ్చారు.ఇప్పటివరకు పంచ్ ప్రసాద్ చేతులకు మాత్రమే 50 ఇంజక్షన్లు చేయడం జరిగిందని పంచ్ ప్రసాద్ భార్య అన్నారు.
ప్రస్తుతం పంచ్ ప్రసాద్ ఆరోగ్యం బాగానే ఉందని ఆమె చెప్పుకొచ్చారు.చికిత్స తర్వాత మాత్రం పంచ్ ప్రసాద్ కు తీవ్రమైన నొప్పి ఉంటుందని పంచ్ ప్రసాద్ భార్య కామెంట్లు చేశారు.
పంచ్ ప్రసాద్ నడవడానికి ప్రయత్నం చేస్తున్నాడని ఆయన భార్య అభిప్రాయం వ్యక్తం చేయడం గమనార్హం.తాజాగా తీవ్రమైన జ్వరంతో బాధ పడుతూ పంచ్ ప్రసాద్ ఆస్పత్రిలో చేరడం జరిగింది.జబర్దస్త్ షోలో( Jabardast show ) పంచ్ ప్రసాద్ స్కిట్లు చేస్తున్నా నడవటానికి ఇబ్బంది పడుతున్నారని అర్థమవుతున్న సంగతి తెలిసిందే.పంచ్ ప్రసాద్ పూర్తి స్థాయిలో కోలుకోవాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.
పంచ్ ప్రసాద్ కు ఈటీవీ ఛానల్ నుంచి భారీ స్థాయిలోనే ఆఫర్లు వస్తున్నాయనే సంగతి తెలిసిందే.పంచ్ ప్రసాద్ కు నెలకు మూడున్నర లక్షల రూపాయల వేతనం వచ్చేది.
ప్రస్తుతం షోల సంఖ్య తగ్గడంతో పంచ్ ప్రసాద్ పారితోషికం కూడా తగ్గుతోంది.పంచ్ ప్రసాద్ మరికొన్ని నెలల్లో సాధారణ మనిషి కావడంతో పాటు తన కామెడీ టైమింగ్ తో ఆకట్టుకుంటాడని ఫ్యాన్స్ భావిస్తున్నారు.