రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గం పెగ్గర్ల గ్రామానికి చెందిన నర్మల గంగాధర్ కూతురు నర్మల ఉమా చదువులో మంచి నైపుణ్యం కలిగి ఉండి తను డాక్టర్ కావాలని కోరిక ఉందని కానీ మాకు ఆర్థిక సమస్యల వలన చదువు ఇబ్బంది అవుతుందని, సోమవారం డాక్టర్ గోలి మోహన్ ని కలిసి నాకు మీరు సహకరించాలని కోరగా, డాక్టర్ గోలి మోహన్ వెంటనే స్పందించి ఆర్థిక సహాయాన్ని అందించి నీ చదువుకు నేను భరోసా ఇస్తున్నానని నువ్వు మంచి డాక్టర్ అయ్యి మీ అమ్మ నాన్నలకు, పెగ్గర్ల గ్రామానికి మంచి పేరు తేవాలన్నారు.అదేవిధంగా వేములవాడ నియోజకవర్గంలో ప్రతి పేదింటి బిడ్డ చదువుకోవాలని నా ఆశయం అని అన్నారు.
ఎవరైనా చదువుకోవాలనీ ఉండి, ఆర్థిక స్తోమత లేకుంటే నేను ముందుండి వారిని చదివిస్తానని తెలిపారు.ఈరోజు వేములవాడ నియోజకవర్గం లో ఎంతో మంది యువతను కాపాడుకుంటూ యువత ఊర్లో కాదు ఉద్యోగంలో ఉండాలని ఆర్థికంగా ఎదగాలని ఉన్నతమైన చదువుకి అమెరికా,లండన్,కెనడా లాంటి దేశాలు వెళ్లాలని దానికి నా సహాయ సహకారాలు ఎల్లవేళలా ఉంటాయని తెలియజేస్తూ ప్రతి ఒక్క పేదింటి బిడ్డ చదువుకోవాలని వారు నిరాశ పడకుండా ముందుకు సాగాలని దానికి రాబోయే రోజుల్లో ఒక మంచి ప్రణాళికతోని విద్యనే లక్ష్యంగా ఈ నియోజకవర్గాన్ని ఉన్నతమైన స్థితికి తీసుకెళ్తానని తెలియజేశారు.
వేములవాడ నియోజకవర్గంలోని ప్రజలందరూ ఐక్యంగా ఉంటూ మంచి నాయకుడిని ఎన్నుకోవాలని రాబోయే రోజుల్లో మీ ఆశీర్వాదంతో నేను ముందుకు వస్తున్నాను అని నన్ను మీరందరూ ఆశీర్వదించి నియోజకవర్గ శాసనసభ్యునిగా ఎన్నుకోవాలని తెలియజేశారు.అంతేకాకుండా ఈ నియోజకవర్గంలో ప్రతి ఒక్క యువతను సరైన మార్గంలో నడిపిస్తానని, రైతులను నూతన విధానం ద్వారా మంచి వ్యవసాయాన్ని పెంపొందించేలా కృషి చేస్తానని మహిళలు తమ సొంత కాళ్ళ మీద నిలబడి ఉన్నతమైన స్థానానికి వెళ్లేలా చేస్తానని తెలియజేశారు.