రాజన్న సిరిసిల్ల జిల్లా : “ఠాణా దివస్” కార్యక్రమంలో భాగంగా తేదీ 04-04-2023 మంగళవారం వేములవాడ రూరల్ మండల పోలీస్ స్టేషన్ లో ఉదయం 10:30 గంటల నుండి అందుబాటులో ఉంటానని జిల్లా ఎస్పీ వెల్లడించారు.
కావున వేములవాడ రూరల్ మండల పరిధిలోని గ్రామాల ప్రజల నుండి అర్జీలను స్వయంగా స్వీకరించి,దీర్ఘకాలికంగా పెండింగ్ లో ఉన్న కేసులను,గ్రామాల్లో ఉన్న సమస్యలను చట్టపరంగా పరిష్కరించనున్నట్లు తెలిపారు.
వేములవాడ రూరల్ మండల పరిధిలోని గ్రామాల ప్రజల ఇట్టి అవకాశాన్ని సద్వినియోగం చెసుకోవాలని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఒక ప్రకటనలో తెలిపారు.