మాస్ మహారాజ రవితేజ( Raviteja) హీరోగా ఇండస్ట్రీలో వరుస సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్నారు.ఈ క్రమంలోని తాజాగా రవితేజ నటించిన రావణాసుర(Ravanasura) సినిమా ఏప్రిల్ 7వ తేదీ విడుదలకు సిద్ధమవుతుంది.
ఇలా ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడటంతో పెద్ద ఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా హైదరాబాద్లోని శిల్పకళా వేదికలో ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకను ఎంతో ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి డైరెక్టర్ గోపిచంద్ మలినేని (Gopichan Malineni) హాజరయ్యారు.
ఈ కార్యక్రమంలో భాగంగా డైరెక్టర్ గోపీచంద్ రవితేజ(Raviteja) గురించి మాట్లాడుతూ ఎన్నో విషయాలు తెలియజేశారు.తనకు ఇండస్ట్రీలో అవకాశం ఇచ్చినటువంటి హీరో రవితేజ అని తెలిపారు.ఆయన కారణంగానే నేను ఇండస్ట్రీలో నిలబడగలిగానని తెలియజేశారు.
ఇక చాలామంది నేను రవితేజ అన్న తమ్ముళ్లు అనుకుంటారు.నేను అచ్చం తన పోలికలతో ఉండటంతో అందరూ తన తమ్ముడనీ అనుకున్నారు.
అయితే ఆయన పోలికలతో ఉండడం నా అదృష్టం.ఇక ఆయనకు నేను ఒక తమ్ముడు లాంటి వాడినేనని తెలియజేశారు.
ఇక ఆయనతో కలిసి నేను చేసిన ఫస్ట్ సినిమా డాన్ శీను(Don seenu).ఈ సినిమా ప్రారంభోత్సవానికి గెస్ట్ గా రాజమౌళి(Rajamouli) గారిని పిలుద్దామని వెళ్లాను.
రాజమౌళి గారి వద్దకు వెళ్లిన తాను ఇలా రవితేజ గారితో సినిమా చేస్తున్నానని చెప్పగానే రాజమౌళి గారు నన్ను ఒక విధంగా హెచ్చరించారని ఈ సందర్భంగా గోపీచంద్ తెలిపారు.రవితేజ ఒక వేరియేషన్ అడిగితే నాలుగు వేరియేషన్లు చేసి చూపిస్తారు.ఆయనతో జాగ్రత్త ఆయన ఎనర్జీని అందుకోవడం చాలా కష్టం.ఇక రవితేజ విషయంలో నీకు ఎలాంటి సందేహాలు అవసరం లేదు దూసుకెళ్లిపో అంటూ రాజమౌళి రవితేజ విషయంలో నన్ను ఇలా హెచ్చరించారు అంటూ ఈ సందర్భంగా అప్పటి విషయాలను గోపీచంద్ గుర్తు చేసుకుంటూ చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.